దుబాయ్ టవర్స్ పై సూపర్ స్టార్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్!

సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ దుబాయ్ లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమా షూటింగ్ లో భాగంగా మహేష్ ఫ్యామిలీ సైతం దుబాయ్ ట్రిప్ లో ఉంది. షూటింగ్ సాగుతుండగానే… ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్ని దుబాయ్ లోనే సెలబ్రేట్ చేసుకున్నారు.

తాజాగా దానికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ గా మారింది. మహేష్..నమ్రత.. పిల్లలు గౌమత్.. సితార కలసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ సిటీని కవర్ చేసేలా ఎత్తైనా టవర్స్ పై ఇలా మమేష్ ఫ్యామిలీ ఫోటో దిగింది. ఆకాశహార్మ్యం నుంచి దుబాయ్ సిటీ అంతా ఎంతో మనోహరంగా కనిపిస్తోంది.

ఇందులో మహేష్ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ ధరించాడు. బ్లాక్ టీషర్ట్ ఆపైన బ్లాక్ వింటర్ కోట్..బ్లూ జీన్ ఫ్యాంట్ ధరించాడు. ఇక నమ్రత లట్ ఎల్లో కలర్ షర్ట్ ధరించారు. నాచు కలర్ ఫ్యాంట్ ..వైట్ షూటస్ ధరించారు. సితార స్కై బ్లూ షర్ట్…బ్లూ చినుగల జీన్ ధరించింది క్యూట్ లుక్ లో ఆకట్టుకుంటోంది.

ఇక గౌతమ్ టీషర్ట్ ..నిక్కరు ధరించాడు. ప్రస్తుతం ప్యామిలీ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ప్రతీ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్ని మహేష్ చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తారు. ఫ్యామిలీతో విదేశాలు వెళ్లిపోయి వారం రోజుల పాటు ఎంజాయ్ చేసి వస్తారు. ఎక్కువగా ఇటలీ..ప్యారిస్..స్పెయిన్ వంటి దేశాలు వెళ్తుంటారు.

అయితే కరోనా వైరస్ ఉధృతి భయాలతో పాటు..సినిమా షూటింగ్ కూడా ఉండటంతో దుబాయ్ తో సరిపెట్టుకున్నారు. సెలబ్రేషన్స్ అనంతరం మహేష్ మళ్లీ షూటింగ్ లో బిజీ అవుతారు. అనంతరం నమ్రత దుబాయ్ టూర్ ముగించి పిల్లలతో హైదరాబాద్ చేరుకుంటారు. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఉధృతి పెరుగుతోంది కాబట్టి నమ్రత పిల్లలితో బయటి ప్రదేశాలు తిరగడానికి ఆస్కారం కూడా లేదు.

ప్రస్తుతానికి హైదరాబాద్ మాత్రమే కరోనాకి మంచి భద్రత గల ప్రదేశంగా చెప్పొచ్చు. అన్నట్టు ఎత్తైన ఆ భవంతి బుర్జ్ ఖలీఫా కాదు కదా? అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ లోనే అత్యంత ఎత్తైన ఆకాశహార్మ్యంగా టూరిజం ప్రాబల్యానికి ఉపకరిస్తున్న టవర్ గా బుర్జ్ ఖలీఫాకి పేరుంది. ఈ టవర్ పై ఇప్పటికే మహేష్ కి సంబంధించిన ఎన్నో సినిమాల షూటింగులు జరిగాయి. నిరంతరం ఇక్కడ తెలుగు-తమిళం -హిందీ సహా పలు భాషల చిత్రాల్ని దుబాయ్ పరిసరాల్లో తెరకెక్కిస్తున్నారు.