సర్కారు వారి పాట టీమ్ మళ్ళీ సిద్ధమైంది

డిసెంబర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట లాస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. మహేష్ మోకాలికి శస్త్రచికిత్స జరగడం, తర్వాత కరోనా థర్డ్ వేవ్, సర్కారు వారి పాట టీమ్ లో మహేష్ తో సహా పలువురికి కరోనా సోకడం, ఆపై మహేష్ కుటుంబంలో విషాదం.. ఇలా పలు కారణాలతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం ఈరోజు నుండి చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ మొదలైంది. అయితే మహేష్ ఇంకా షూటింగ్ లో పాల్గొనట్లేదు. వచ్చే వారం నుండి షూటింగ్ కు హాజరవుతాడట. ఈలోగా మహేష్ అవసరం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారట.

పరిస్థితులు అనుకూలిస్తే మహేష్ రెండో వారానికి షూటింగ్ ను పూర్తి చేయాలన్నది టీమ్ ఆలోచన. అలా అయితే ముందే అనుకున్నట్లు ఏప్రిల్ 1న చిత్రాన్ని విడుదల చేయవచ్చు.