మహేష్ ట్విట్టర్ ను తెగ చెక్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ అకౌంట్ ని పదే పదే ఓపెన్ చేసి ప్రభాస్ అభిమానులు చూస్తూ ఉన్నారు. మహేష్ బాబు నుండి ఏదైనా ట్వీట్ వస్తుందా అంటూ వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ గత రెండు రోజులుగా మహేష్ బాబు ట్విట్టర్ నుండి తమకు కావాల్సిన ట్వీట్ మాత్రం రావడం లేదు. దాంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజుల తర్వాత అయినా మహేష్ బాబు ట్విట్టర్ అకౌంట్ నుండి తమకు కావాల్సిన ట్విస్ట్ వస్తుందేమో అంటూ ప్రభాస్ అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా గురించి మహేష్ బాబు ఏమైనా స్పందిస్తాడో అని ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇంకా చిన్న సినిమాలు.. ఇలా చాలా సినిమాలకు సంబంధించిన తన ఫీలింగ్ ను రివ్యూ గా ఇస్తున్నాడు. కనుక మా అభిమాన హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాకు కూడా ఆయన రివ్యూ ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నాం అంటున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందిన రాధేశ్యామ్ సినిమా కు మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ సినిమా చాలా స్లో గా ఉందని నెగిటివ్ ప్రచారం ఎక్కువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు కావడం లేదు. ఈ సమయం లో సినిమా గురించి పాజిటివ్ గా స్పందిస్తే మహేష్ బాబు క్రెడిబులిటి దెబ్బ తింటుందని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

మహేష్ ఈ సినిమా గురించి ఎలాంటి రివ్యూ ఇవ్వడం గాని కామెంట్ చేయడం గాని అవసరం లేదంటూ సూపర్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా బాగున్నప్పుడు బాగుంది అంటూ రివ్యూ ఇవ్వడం పర్వాలేదు కానీ.. బాగా లేనప్పుడు బాగుంది అంటూ ఎలా చెప్పాలి. అలా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో ఇండైరెక్టుగా సినిమా పై మరియు ప్రభాస్ అభిమానుల పై కామెంట్ చేస్తున్నారు.

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తి చేసే క్రమంలో బిజీగా ఉన్నాడు. ఆ కారణంగా రాధేశ్యామ్ సినిమా చూసి ఉండరు. కనుక సినిమా గురించి ట్విట్టర్లో ఇంకా ఎలాంటి స్పందన లేదు. ఒకటి రెండు రోజుల్లోనే కచ్చితంగా మహేష్ బాబు సినిమా ను చూస్తాడని అప్పుడు ఆయన నుండి స్పందన వస్తుందని అభిమానులు సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు.

అతి త్వరలోనే మహేష్ బాబు నుండి రాధేశ్యామ్ సినిమా కు సంబంధించిన రివ్యూ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాధేశ్యామ్ సినిమా గురించి ఇప్పటికే పలువురు స్టార్స్ పాజిటివ్ గా స్పందించారు. మరి మహేష్ బాబు ఎలా స్పందిస్తాడు అనేది సాధారణ జనాలకు మరియు ప్రేక్షకులకు కూడా ఆసక్తిగా మారింది.