హిందీ సినిమాలు చేస్తారా అనే ప్రశ్నకు మహేష్ బాబు స్పందన

సౌత్ హీరోల స్థాయి ముఖ్యంగా తెలుగు హీరోల స్థాయి బాలీవుడ్ వరకూ పాకింది సందేహం లేదు ఒకప్పుడు సౌత్ హీరోలు అంటే బాలీవుడ్ హీరోల్లో మరియు ఫిల్మ్‌ మేకర్స్ లో చిన్నచూపు ఉండేది. కానీ ఇప్పుడు సౌత్ హీరోలకు బాలీవుడ్ హీరోల ను మించి ఆధరణ లభిస్తోంది. పాన్‌ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, అల్లు అర్జున్ ఇంకా కొందరు గుర్తింపు దక్కించుకోవడంతో రాబోయే కాలంలో బాలీవుడ్ స్టార్స్ సినిమాలను మించి మన స్టార్స్ సినిమాలు ఉంటాయని సినీ ప్రేమికులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే మన స్టార్స్ నటించిన సినిమాలు హిందీ సినిమాలను మించి వసూలు చేస్తున్నాయి. ఈ సమయంలో స్పెషల్ గా వెళ్లి హిందీలో నటించాల్సిన అవసరం ఏంటి అన్నట్లుగా మహేష్ బాబు అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ బాబు ని జర్నలిస్టు హిందీలో సినిమా ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నించగా.. హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంది, తెలుగులో నటిస్తున్నాను కదా. తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారు. అలాంటప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా వెళ్లి హిందీ సినిమాల్లో నటించాల్సిన అవసరం ఏముంది అంటూ తన మనసులో మాటను వెల్లడించాడు. మహేష్ బాబు అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.