75 ఏళ్ళ రికార్డ్స్ బ్రేక్ చేసిన మహేష్ ‘పోకిరి’లోని 5 బ్లాక్ బస్టర్ పాయింట్స్

‘అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు – జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరంలేదు’ అంటూ త్రివిక్రమ్ మహేష్ బాబు ‘ఖలేజా’లో రాసిన డైలాగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. చెప్పాలంటే ఇది 75 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రని తిరగ రాస్తుందని ఎవరూ అనుకోలేదు కానీ వచ్చింది, రికార్డ్స్ అన్నీ మడత పెట్టేసింది.. టాలీవుడ్ ఆల్ టైం టాప్ బ్లాక్ బస్టర్ ప్లేస్ లో కూర్చుంది.

ఈ సినిమాలో పూరి రాసిన డైలాగ్ ‘గాంధీ సినిమా ఇండియాలో ఆడదు, అదే ‘కడప కింగ్’ అని తీ, 200 సెంటర్స్ 100 డేస్’. ఈ డైలాగ్ పూరి ఏ ముహూర్తాన రాశాడోగానీ పోకిరి సినిమా రిజల్ట్ విషయంలో అక్షర సత్యం అయ్యింది. పోకిరి సినిమా 200 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకొని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా మహేష్ బాబు, పూరి జగన్నాధ్, ఇలియానా, సాయాజీ షిండే మొదలైన ఎందరో నటీనటులను ఒక్కసారిగా 10 మెట్లు పైకి ఎక్కించడమే వారికి తిగులేని పేరు తెచ్చి పెట్టింది. ముఖ్యంగా మహేష్ బాబు కెరీర్ ని మాత్రం పోకిరికి ముందు – పోకిరీ తరువాత అనేలా చేసిన సినిమా ‘పోకిరి’ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

1. ‘నెవర్ బిఫోర్ – నెవర్ ఆఫ్టర్’ అనేలా మహేష్ బాబు ప్రెజంటేషన్

అప్పటి వరకూ మహేష్ బాబు ఒకే తరహాలో సినిమాలు చేస్తున్నారు, కొన్ని సినిమాల్లో ఎక్కువ డైలాగ్స్ కూడా ఉండేవి కాదు.. కానీ ‘ పోకిరి’ సినిమాలో మహేష్ బాబు డైలాగ్స్ తప్ప మిగతా ఎవరివి పెద్దగా వినపడవు. తన హెయిర్ స్టైల్, తన లుక్, తన డైలాగ్ డెవిలివరీ, తన డిక్షన్ అండ్ కామెడీ టైమింగ్ తో మహేష్ బాబు అదరగొట్టాడని చెప్పాలి.

2. పూరి జ’గన్’ బుల్లెట్స్ అండ్ టేకింగ్

పూరి జగన్నాధ్ అంటేనే తన గన్ లోని బుల్లెట్స్ లా డైలాగ్స్ ఉంటాయని అంటారు. అప్పటి వరకూ ఆయన చేసిన సినిమాల్లో కొన్ని కొన్ని పంచ్ డైలాగ్స్ పేలాయి కానీ పోకిరి సినిమాలో ఆయన రాసిన ప్రతి డైలాగ్ తెలుగు ప్రేక్షకులందరి నోళ్ళలో ఇప్పటికీ నానుతూనే ఉంటాయి. అలాగే టేకింగ్ పరంగా కూడా పూరి కెరీర్లో టాప్ ప్లేస్ ఇవ్వగలిగిన సినిమా.

పూరి రాసిన ‘పోకిరి’ లోని కొన్ని బుల్లెట్స్:

– ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు..

– ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా బుల్లెట్టు దిగిందా లేదా..

– సినిమాలు చూట్లేదేటి..

– తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా..

3. నాజర్ రిలీవ్ చేసే ఫెంటాస్టిక్ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్

‘కృష్ణ మనోహర్ ఐపిఎస్.. ఇండియన్ పోలీస్ సర్వీస్, 57థ్ బ్యాచ్.. బ్యాడ్జ్ నెంబర్ 32567.. ట్రైన్డ్ అట్ డెహ్రాడూన్.. టాపర్ ఇన్ ది బ్యాచ్.. కృష్ణ మనోహర్ ఐపిఎస్ సన్ అఫ్ సూర్యనారాయణ’ – నాజర్ నుంచి వచ్చే ఈ డైలాగ్స్, ఈ సీన్ కంటెంట్ చూస్తున్న ఆడియన్స్ కి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసి ఆదిఅయిన్స్ ఫీలింగ్ ని ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చుతుంది. ఇక్క క్రియేట్ చేసిన ఫీల్ లోనే నెక్స్ట్ 10 సినిమాల క్లైమాక్స్ అంతా ఉండడంతో ఆడియన్స్ బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్ తోనే బయటకి వస్తారు.

4. మణిశర్మ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ‘పోకిరి’కి అందించిన 6 పాటలు ఒకదానితో ఒకటి సంబంధం లేకిడ్నా ఉంటూనే 6 పాటలు సూపర్ హిట్ అయ్యాయి.. వీటన్నిటికంటే మించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎన్నో హీరోయిక్ సీన్స్ లో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసాడు.

5. లవ్ స్టోరీ, వెటకారం అండ్ ఫన్

పోకిరి లాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ లో ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీని పూరి చాలా అందంగా క్రియేట్ చేసాడని చెప్పాలి. ఇదే రీతిలో ఆ తావతా అబ్బాయిలు అమ్మాయిల వెంట పడ్డారు. అలాగే సాయాజీ షిండే పాత్రలో మీడియా మీద వేసిన సెటైరికల్ పంచ్ డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్.. ఇకపోతే ‘బబబబ్బ్బా బబాబ్బాబ్బబా అంటూ సాగే బ్రహ్మి: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ – అలీ కామెడీ ట్రాక్ కూడా సరదాగా కథలో కలిపేసి ఎంటర్టైన్మెంట్ ని కూడా ఇచ్చారు.

కొసమెరుపు: ‘పోకిరి’ సినిమా 75 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రని తిరగరాస్తూ క్రియేట్ చేసిన ఆల్ టైం రికార్డ్స్..

50 డేస్ – 300 సెంటర్స్
100 డేస్ – 200 సెంటర్స్
175 డేస్ – 63 సెంటర్స్
200 డేస్ – 15 సెంటర్స్
300 డేస్ – 2 సెంటర్స్

టాలీవుడ్ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమాని క్వారంటైన్ లో సరదాగా ఇంకోసారి చూసి ఎంజాయ్ చేసేయండి.. అలాగే మీకు నచ్చిన వేరే పాయింట్స్ ఎమన్నా ఉంటే కింద కామెంట్స్ లో తెలపండి..