ఆకాశం నీ హద్దురాపై మహేష్‌ కామెంట్స్‌

సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన సూరారై పోట్రూ పై ఇండస్ట్రీ వర్గాల వారు పలువురు స్పందించారు. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ వరుస ట్వీట్స్‌ తో ఆకాశమే నీ హద్దుపై ప్రశంసలు కురిపించాడు. ఈసారి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు వంతు. ఇటీవలే దుబాయి నుండి తిరిగి వచ్చిన మహేష్‌ బాబు వెంటనే ఈ సినిమాను చూసినట్లుగా తెలుస్తోంది. తమిళం మరియు తెలుగులో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై మహేష్‌ బాబు చేసిన కామెంట్స్‌ మరింతగా సినిమాపై ఆసక్తి పెరిగేలా చేశాయి.

మహేష్ బాబు ట్విట్టర్‌ లో.. సూరారై పోట్రూ అద్బుతమైన ఇన్సిపిరేషనల్‌ మూవీ. సూపర్బ్‌ నటనతో పాటు బ్రిలియంట్‌ డైరెక్షన్‌. బ్రదర్ సూర్య మీరు అద్బుతంగా నటించారు. చిత్ర యూనిట్‌ సభ్యులందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మహేష్ ట్వీట్‌ లో పేర్కొన్నాడు. మహేష్‌ ట్వీట్‌ కు సూర్య స్పందించాడు. మీ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు బ్రదర్‌. మీ సర్కారు వారి పాట సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాను అంటూ సూర్య రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి ట్వీట్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

థియేటర్లు ఓపెన్‌ లేని కారణంగా అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల అయిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. అద్బుతమైన రెస్పాన్స్‌ దక్కిన ఈ సినిమాపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించగా ఇప్పుడు మహేష్‌ బాబు ఆ జాబితాలో చేరాడు. తెలుగు మరియు తమిళంలో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ దక్కించుకున్న నేపథ్యంలో థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే వంద కోట్లకు పైగా వసూళ్లు చేసి ఉండేది అంటూ అభిమానులు అంటున్నారు.