మహేష్ క్రికెట్ కోచ్ గా కనిపించబోతున్నాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే. అప్పట్లో వీరి కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుందని అన్నారు కానీ దాని గురించి మళ్ళీ ఎటువంటి వార్త లేదు. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో తన నెక్స్ట్ సినిమా కచ్చితంగా ఉంటుందని ప్రకటించాడు ఇటీవలే అనిల్ రావిపూడి.

మహేష్ తో సినిమా ఉంటుంది. అయితే దానికి ఇంకా కొంత సమయం పడుతుంది అని తెలిపాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలక విషయం ఒకటి బయటపడింది. ఈ చిత్రంలో మహేష్ క్రికెట్ కోచ్ గా నటిస్తాడని అంటున్నారు. ఈ పాత్ర చాలా ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.