సూపర్ స్టార్ మహేశ్-నమ్రత దంపతుల కుమారుడు గౌతమ్ కృష్ణ స్విమ్మింగ్ లో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని టాప్ 8 ఈతగాళ్ల జాబితాలో స్థానం సంపాదించాడు. 2018లో ఫ్రొఫెషనల్ స్విమ్మర్‌గా మారిన గౌతమ్.. 15 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. గౌతమ్ స్విమ్మింగ్ రికార్డును నమ్రత తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా పంచుకున్నారు.
గౌతమ్ స్విమ్మింగ్ లో 3 గంటల్లో 5 కిలోమీటర్ల దూరాన్ని ఈదగలడని తెలిపారు. స్విమ్మింగ్ లో బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్.. వంటి నాలుగు పద్ధతుల్లో స్విమ్ చేయగలడని తెలిపారు. కుమారుడి స్విమ్మింగ్ లో నెలకొల్పుతున్న రికార్డులపట్ల నమ్రత సంతోషం వ్యక్తం చేశారు. గౌతమ్ బాలనటుడిగా తండ్రి నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించి తెరంగేట్రం చేశాడు.