అరే బాబూ.. మహేష్ పైనే ఏసేసిందిగా చిలిపి కీర్తి..

చిలిపి అల్లరి కీర్తి.. మహేష్ పైనే ఏసేసిందిగా.. గత కొన్ని గంటలుగా యూత్ లో అదే డిస్కషన్. ఇంతకీ కీర్తి ఏం ఏసేసింది? అంటే అదిరిపోయే పంచ్ వేసింది. మహేష్ తో కలిసి `సర్కార్ వారి పాట` చిత్రంలో నటిస్తోంది కాబట్టి దగ్గరగా తననే చూస్తూ అలా ఉండిపోయినట్టుంది. ఇంతకీ ఇంతటి పాల బుగ్గల ఛామ్ ఎలా సాధ్యం బాబూ! అంటూ ఆరాలు తీస్తూనే రోజంతా గడిపేస్తోంది కీర్తి.

మహేష్ బాబు పుట్టినరోజు సీడీపీతో కీర్తి సురేష్ తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్ ని రీప్లేస్ చేయడం మొదలు.. నిన్న రాత్రి మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం వరకూ అంతా బాగానే ఉంది కానీ..తన తాజా ట్వీట్ తన ఫేవరెట్ హీరోపై ఆమెకున్న క్రష్ ని బయటపెట్టింది. కాస్త ఫన్నీగా ఉన్నా కానీ మహేష్ పై తన మనసులో ఉన్న ఆ ఇది దాచుకోలేకపోయింది సుమీ!

మహేష్ ని తథేకంగా ఘాడంగా లోతైన ప్రేమతో చూస్తూ ఉండిపోయిన కీర్తి ఫోటోని పోస్ట్ చేసి ఫన్నీ వ్యాఖ్యను జోడించింది. “#నమ్రత మేడమ్ గారు.. సర్ పడుకునే ముందు ప్రతిరోజు దిష్టి తీయదం మార్చిపోకండి..“ అంటూ సూచించింది. SVP పుట్టినరోజు బ్లాస్టర్ టీజర్ లో మహేష్ వయస్సును దాచేస్తున్న లుక్స్ పై రోజంతా ప్రశంసలు కురిపించిన కీర్తి.. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ను సరదాగా ఆటపట్టించింది.

కన్నె పిల్లల మనసు మహేష్ పై ఎలా ఉంటుందో తన మాటతో చెప్పకనే చెప్పింది కీర్తి. నిన్నంతా మహేష్ ఛామ్ పై సెలబ్రిటీలంతా పొగడ్తల వర్షం కురిపించారు. కేటీఆర్.. చిరంజీవి వంటి వారు ఎంతో అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడిలా కీర్తి మాత్రమే కాదు మహేష్ అభిమానులు కూడా అదే అనుభూతి చెందుతున్నారు. మొత్తానికి ఒకే ఒక్క పంక్తితో మహేష్ అభిమానులందరి హృదయాలను గెలుచుకుంది కీర్తి. ఇక రోజంతా మహేష్ గురించి టాలీవుడ్ ప్రముఖులు షేర్ చేసిన మంచి మాటలన్నింటినీ రీట్వీట్ చేయడంతో కీర్తి కాలక్షేపం చేసింది. తన హీరోపై ఎంతగా మనసు పారేసుకున్నా కానీ.. మరీ అలా నమ్రతనే కాకాపడుతుందా! అంటూ అభిమానులు ఇప్పుడు కీర్తిపైనా సరదా కామెంట్లు చేస్తున్నారు.