టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఆస్తులను ఇప్పటికే వేలం వేసేందుకు ప్రకటన సిద్దం చేశారు. అయితే ఈ వేలంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి ఆస్తులను వేలం వేసే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలోనే మంచు మనోజ్ కూడా స్పందించాడు.
టీటీడీ ఆస్తులను దేవుడు ఏమైనా అమ్మమని చెప్పాడా? కరోనా సంక్షోభంలో రోజుకు లక్ష మందికి ఆకలి తీర్చమని దేవుడు చెప్పాడా? ఇవన్నీ కూడా టీటీడీ అధికారులు మాత్రమే చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్తులను అమ్మేందుకు రెడీ అవ్వడంతో గోవిందా గోవిందా అంటూ అరిచే ఈ గొంతు తడబడుతుంది. మోసం జరిగిందని అనడం లేదు.
ఇన్ సైడ్ ట్రేడిగ్ ద్వారా వేలం వేయలేదు కనుక మోసం లేదు. అయితే తిరుమల ఆస్తులను ఎందుకు అమ్మాయిల్సి వస్తుందనే విషయంలో ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీకి ఉందని కోరుతున్నాను. తిరుమలకు చెందిన వాడిగా నాకు ఈ విషయం తెలుసుకోవాలని ఉంది అంతే అంటూ టీటీడీని సున్నితంగా మనోజ్ ప్రశ్నించాడు.