బ్లాక్ బస్టర్ మారుతి.. హీరోల కోసం వెయిటింగ్

కమర్షియల్ చిత్రాలలో తనకంటూ ఒక పంథా ఏర్పరుచుకున్నాడు మారుతి. ప్లాప్ కొట్టినా వెంటనే దాన్ని మైమరపించే బ్లాక్ బస్టర్ ను అందుకోవడం మారుతికి అలవాటు. గతేడాది ప్రతిరోజూ పండగే చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించాడు మారుతి. పెట్టిన పెట్టుబడికి రెండింతలు మించి వసూలు చేసిందీ చిత్రం. దీంతో మారుతి పేరు మార్మోగిపోయింది. అయినా ఏం లాభం, ప్రస్తుతం మారుతి వెయిటింగ్ పీరియడ్ లో ఉండాల్సి వస్తోంది.

మారుతి.. లాక్ డౌన్ సమయంలో రామ్ కు కథ చెప్పి ఒప్పించాలని ప్రయత్నించాడు. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు. ఇక యువ హీరోలు అందరూ బిజీ బిజీగా ఉన్నారు. నాని వచ్చే ఏడాది సమ్మర్ వరకూ ఫుల్ బిజీ. నితిన్ అయితే నాలుగు చిత్రాలు చేతిలో ఉంచుకున్నాడు. శర్వానంద్, విజయ్ దేవరకొండలు వచ్చే ఏడాది కూడా బిజీనే. పోనీ సాయి తేజ్ తో మళ్ళీ చేద్దామా అన్నా కూడా తను కూడా రెండు సినిమాలను కన్ఫర్మ్ చేసుకుని ఉన్నాడు.

అందుకనే ప్రతిరోజూ పండగే విడుదలై ఏడు నెలలు గడిచినా కూడా మారుతి తర్వాత సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చే ఏడాది వరకూ వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. అందుకే మారుతి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాడు. ఈ ఖాళీ సమయంలో వెబ్ సిరీస్ లు తెరకెక్కించాలని అనుకుంటున్నాడు.