గతకొద్ది రోజులుగా ‘బంగారం’ ‘వాన’ సినిమాల్లో కనిపించిన మీరా చోప్రా – ఎన్.టి.ఆర్ అభిమానుల మధ్య నడుస్తున్న విషయం తెలిసిందే. ‘నాకు ఎన్.టి.ఆర్ ఫాన్స్ తెలియదు, నేను ఆయన ఫ్యాన్ ని కాదని’ చెప్పడంతో ఆమెపై ఎన్.టి.ఆర్ అభిమానులు ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారని ఆమె కంప్లైంట్ ఇవ్వడంతో హైదరాబాద్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం వారు కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేసారు. ఇప్పటికీ మీరా చోప్రా తనని కామెంట్ చేసిన కొందరి స్క్రీన్ షాట్స్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ కొత్తగా కంప్లైంట్స్ రిజిష్టర్ చేయమని హైదరాబాద్ పోలీసులను కోరుతోంది.
అంతే కాకుండా దీనిలోకి రాజకీయ నాయకుల్ని కూడా ఇన్వాల్ చేస్తోంది. తాజాగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మరియు మినిస్టర్ తేనేటి వనితలని కూడా టాగ్ చేసి తనకి ఏపీలోని ఎన్.టి.ఆర్ అభిమానుల నుంచి ప్రమాదం ఉందని, వారిపై హైదరాబాద్ పోలీసులకి కంప్లైంట్ చేసానని, దానిపై కచ్చితమైన ఇన్వెస్టిగేషన్ జరిగేలా వారికి సహకరించాలని కోరింది. అలాగే ఆమె ఇంత జరుగుతున్నా ఎన్.టి.ఆర్ ఎందుకు స్పందించడం లేదు, తన అభిమానులను ఎందుకు కంట్రోల్ చేయడం లేదని ఆమె ప్రశ్నించింది. ఇదీ ఇప్పటి వరకూ జరిగిన కథ..
అసలు ఈ విషయం ఎందుకు ఈ స్థాయికి వెళ్ళింది, నిజంగానే జరుగుతోందా లేక దీని వెనక ఎవరన్నా ఉన్నారా అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయగా.. ఆమె మొదట ట్వీట్ వేసినప్పుడు ఎన్.టి.ఆర్ అభిమానులు పెద్దగా రియాక్ట్ కాలేదు, కానీ ఎప్పుడైతే ఆమె ఎన్.టి.ఆర్ కి సంబందించిన కొన్ని ట్రోల్స్ ని లైక్ చేయడం మొదలు పెట్టిందో అప్పుడు అభిమానులు వాళ్ళ టెంపర్ మిస్ అయ్యి ఆమెని ట్రోల్ చేశారు. చెప్పాలంటే మొదట్లో ఇతర హీరోల అభిమానులు కూడా ట్రోల్ చేశారు. కానీ మీరా చోప్రా మాత్రం ఎన్.టి.ఆర్ అభిమానులని టార్గెట్ చేసి, సమస్యని పెద్దది చేయడం మొదలు పెట్టింది.
ఎప్పుడైతే ఇది రైజ్ అయ్యిందో సడన్ గా ‘వీ సపోర్ట్ మీరా చోప్రా’ అంటూ ఓ టాగ్ పుట్టుకొచ్చింది. ఆ ట్రెండ్ కి సంబదించి ఎక్కువ ట్వీట్స్ బంగ్లాదేశ్, అలాగే నార్త్ ఇండియా నుంచి వచ్చాయి. ఈ అకౌంట్స్ ఎవరివి అని తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఒక పొలిటికల్ పార్టీ సోషల్ మీడియా ట్రెండింగ్స్ కోసం వాడే అకౌంట్స్ అని తెలిసింది. దీని ప్రకారం చుస్తే ఒక అవకాశాన్ని తీసుకొని, పెద్ద సెన్సేషన్ గా మార్చి ఎన్.టి.ఆర్ పై దుష్ప్రచారం చేయడానికి ఆ రాజకీయ పార్టీ చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఎన్.టి.ఆర్ ఎదుగుదల ఎవరికి నష్టం??