మెహ్రీన్‌ తో నిశ్చితార్థం బ్రేక్‌ పై భవ్య బిష్ణోయ్‌ స్పందన

తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన మెహ్రీన్‌ ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమాలో మరియు ఇతర భాషల్లో కూడా నటిస్తుంది. నటిగా బిజీగా ఉన్న మెహ్రీన్ అనూహ్యంగా భవ్య బిష్ణోయ్ తో ప్రేమ పెళ్లి అంటూ షాక్ ల మీద షాక్ లు ఇచ్చి ఎంగేజ్ మెంట్‌ కూడా పూర్తి అయ్యిందని ఫొటోలు షేర్‌ చేసింది. కారణం ఏంటో కాని ఎంగేజ్ మెంట్‌ ను బ్రేక్‌ చేసినట్లుగా ఆమె ప్రకటించింది. దాంతో అప్పటి నుండి భవ్య బిష్ణోయ్‌ కుటుంబంపై మెహ్రీన్ అభిమానులు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. మెహ్రీన్‌ ను హద్దుల్లో పెట్టేందుకు ప్రయత్నించడంతో పాటు ఆమెను వేదించడం వల్లే ఆమె ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుందేమో అంటున్నారు.

నెటిజన్స్‌ వ్యాఖ్యలపై భవ్య బిష్ణోయ్‌ స్పందించాడు. తన గురించి తన కుటుంబ సభ్యుల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిపై తప్పుడు మీడియా కథనాలు ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ హెచ్చరించాడు. ఎంగేజ్మెంట్‌ బ్రేక్‌ విషయంలో వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అందుకు సంబంధించిన కారణాలు ఉన్నాయి. కనుక నేను సమాధానం చెప్పుకోవాలని అనుకోవడం లేదు. ఈ విషయం ఇప్పటితో వదిలేస్తే బెటర్‌.. లేదంటే మాత్రం ముందు ముందు చర్యలు తీసుకుంటాను అన్నాడు.