తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఓ యజ్ఞంలా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో గత కొంత కాలంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పాల్గొని పర్యావరణ సంరక్షణకు మొక్కల ప్రాధాన్యతని తెలియజేస్తూ మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే.
గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సినీ నటులతో పాటు రాజకీయ నాయకులు కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్లో అందాలా నటి క్రేజీ హీరోయిన్ మెహ్రీన్ పాల్గొంది.
ఇటీవల మారుతి రూపొందించిన `మంచి రోజులొచ్చాయి` చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మెహ్రీన్ గురువారం రామానాయుడు స్టూడియోస్లో మొక్కలు నాటి ఛాలెంజ్ని పూర్తి చేసింది.
అనంతరం ఆమె మాట్లాడుతూ `పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరం అని తెలిపింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఈ సందర్భంగా మెహ్రీన్ ధన్యవాదాలు తెలిపింది.
రాబోయే తరాలకు ఎలాంటి పొల్యూషన్ లేని మంచి కాలుష్యాన్ని అందించాలన్న గ్రీన్ ఇండియా క్లీన్ ఇండియా కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటలని మెహ్రీన్ ఈ సందర్భంగా కోరింది.
ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని మెహ్రీన్ కు అందజేశారు. ప్రస్తుతం మెహ్రీన్ .. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న `ఎఫ్ 3` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.