శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం సరికాదని ఎమ్మెల్యే రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్నా. కృష్ణా జలాలల వినియోగంలో ఏపీ అన్యాయం చేయొద్దు. అక్రమ నీటి వినియోగంతో ఏపీ తీవ్రంగా నష్టపోతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇద్దరూ తెలుగు రాష్ట్ర ప్రజలు బాగుండాలనే కోరుకున్నారు’.
‘వివాద పరిష్కారానికి సీఎం జగన్ దేశ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కృష్ణా జలాలా వినియోగంలో ఏపీకి అన్యాయం చేస్తే చూస్తూ ఉరుకోం. రావాల్సిన వాటా పూర్తిగా దక్కాలి కాబట్టే.. కేబినెట్ లో దీనిపై చర్చించారని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే సీఎం జగన్ తెలంగాణ తీరుపై లేఖ రాసినట్టు తెలిపారు. ఏపీకి కేటాయించిన నీటిని ఇవ్వకుండా అన్యాయం చేస్తే సీఎం జగన్, తాము ఊరుకోమ’ని ఈ సందర్భంగా రోజా అన్నారు.