యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో కొమరం భీమ్ గా నటిస్తోన్న ఎన్టీఆర్, తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయడానికి ఇప్పటికే ఓకే చెప్పేసాడు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఎన్టీఆర్ కాంబినేషన్ అరవింద సమేత చిత్రానికి బాగా వర్కౌట్ అయింది. అజ్ఞాతవాసి చిత్రంతో ప్లాప్ కొట్టాక త్రివిక్రమ్ కసితో పని చేసిన సినిమా అరవింద సమేత. ఈ సినిమాలో డైలాగ్స్ హైలైట్స్ లో ఒకటిగా నిలిచిన విషయం తెల్సిందే. ఇక వీరిద్దరూ మరోసారి పనిచేస్తుంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పటికే ఈ చిత్రానికి అయినను పోయి రావాలె హస్తినకు అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసిన సంగతి తెల్సిందే. పొలిటికల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది అని తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజుల నుండి ఈ సినిమాలో మోహన్ లాల్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మోహన్ లాల్ ను ఈ ప్రాజెక్ట్ కోసం అసలు సంప్రదించలేదట.
అయినను పోయి రావాలె హస్తినకు చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.