ఫస్ట్‌లుక్‌ః మోహన్‌ బాబు ‘సన్నాఫ్‌ ఇండియా’

మోహన్‌ బాబు చాలా కాలం తర్వాత గత ఏడాది సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో గెస్ట్ రోల్‌ లో కనిపించాడు. ఫుల్‌ లెంగ్త్‌ రోల్స్‌ హీరోగా సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది. ఈయన ఎట్టకేలకు సన్నాఫ్ ఇండియా మూవీని చేస్తున్న విషయం తెల్సిందే. మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమాకు రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. రచయితగా సుదీర్ఘ కాలం గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రత్నబాబు ఒక మంచి దేశ భక్తి సినిమాను రూపొందించేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేశారు.

మోహన్‌ బాబు వయసుకు తగ్గ పాత్రను ఈ సినిమాలో చేయబోతున్నాడు. దేశ భక్తి కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు స్క్రీన్‌ ప్లేను స్వయంగా మోహన్‌ బాబు అందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్‌ చాలా విభిన్నంగా ఉంటుందని నలుగురిని ఆలోచింపజేసే విధంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాతో మళ్లీ మోహన్ బాబు బిజీ అవుతాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ వ్యవహారాల్లో మంచు లక్ష్మి మరియు మంచు మనోజ్‌ కూడా పాలు పంచుకుంటున్నారు.