సూపర్‌ స్టార్‌ రేంజ్‌ కు తగ్గట్లుగా బిబి పారితోషికం

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్‌ ప్రస్తుతం బిగ్ బాస్‌ కొత్త సీజన్‌ కు సిద్దం అయ్యారు. ఈ సీజన్‌ తో ఆయన మరింతగా ప్రేక్షకులకు బిగ్ బాస్‌ ను చేరువ చేస్తాడనే నమ్మకంను నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ కు హోస్ట్‌ గా వ్యవహరించినందుకు సల్మాన్‌ ఖాన్‌ వందల కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆయన పారితోషికంతో పోల్చితే సౌత్‌ హోస్ట్‌ల పారితోషికం చాలా అంటే చాలా తక్కువ. ఇక సౌత్‌ హోస్ట్‌ల్లో మోహన్ లాల్‌ పారితోషికం రికార్డు బ్రేకింగ్‌ గా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తెలుగులో నాగార్జున, తమిళంలో కమల్‌ హాసన్‌ మరియు కన్నడంలో సుదీప్‌ కిచ్చ లు హోస్టింగ్‌ చేస్తున్నారు. వీరందరిని మించి మలయాళ బిగ్‌ బాస్ హోస్ట్‌ మోహన్ లాల్‌ భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొత్త సీజన్‌ కు గాను దాదాపుగా రూ.20 కోట్ల వరకు పారితోషికంను తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారీ ఎత్తున మోహన్‌ లాల్‌ తీసుకుంటున్న పారితోషికం విషయంలో రికార్డును సృష్టించాడు. ఈ రికార్డు ను మరో సౌత్‌ స్టార్‌ బ్రేక్‌ చేయలేదు. కేవలం బిగ్‌బాస్ విషయంలోనే కాకుండా మరే టీవీ షో కు కూడా ఏ స్టార్‌ ఈ రేంజ్‌ పారితోషికం తీసుకుంటున్నది లేదు అంటున్నారు.