మాజీ మంత్రి.. తెలంగాణలో సీనియర్ పొలిటికల్ లీడర్ అయిన మోత్కుపల్లి నరసింహులు గత కొన్నాళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లుగా అనిపిస్తుంది. గవర్నర్ అవ్వాలి అన్న ఆయన కోరిక నెరవేరకుండానే రాజకీయాల నుండి తప్పుకుంటాడేమో అంటూ అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యంగా అధికార పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే కేసీఆర్ ను అంబేద్కర్ తో సమానుడు అంటూ ప్రశంసించిన మోత్కుపల్లి కారు ఎక్కేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది.
రేపు తన మద్దతు దారులు మరియు కార్యకర్తలతో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లో ఆయన జాయిన్ అయ్యేందుకు సిద్దం అయ్యాడు. కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మోత్కుపల్లికి మంచి పట్టు ఉంది. దళిత నాయకుడిగా మంచి పేరును దక్కించుకున్న మోత్కుపల్లి రాష్ట్రంలో నిర్వహించబోతున్న దళిత బంధు పతకంపై కూడా ప్రశంసలు కురిపించాడు. కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యం కనుక తాను టీఆర్ఎస్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా ఆయన ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.