Mouna Raagam Serial December 20th Episode Online 2019

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మౌనరాగం’ సీరియల్‌ 394 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. నేటికి 395 ఎపిసోడ్‌కి ఎంటర్‌ అయ్యింది. తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న మౌనరాగం (డిసెంబర్ 20) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో ఏం జరిగిందో మీ సమయంలో మీకోసం.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

సీనయ్య చెబుతుంటే.. అమ్ములు మెకానిక్ పని చేస్తుంది. కారు స్టార్ట్ అయ్యేలా చేస్తుంది. దాంతో సీనయ్య చాలా పొంగిపోతాడు. అంతకు ముందే..షెడ్‌లో జరిగిన గొడవలో చక్రీ తప్పు ఉందని తెలుసుకున్న సీనయ్య అవమానించడంతో.. చక్రీ అన్నం తినట్లేదని అమ్ములుకి సైగ చేసి చూపిస్తుంది లక్కీ. అప్పుడే అంతా తింటూ ఉంటారు. ‘సీనయ్యకు తెలియకుండా.. అన్నం తీసుకుని వెళ్లమని లక్కీకి అమ్ములు సైగ చేయడంతో.. కాంతమ్మ అందుకు సహకరిస్తుంది. ‘నేను లోపల తింటాను’ అని అబద్దం చెప్పిన లక్కీ.. అన్నం లోపలికి పట్టుకుని వెళ్లుంది. వెనుకే కాంతమ్మ కూడా వెళ్తుంది.

చక్రీ కోపం!

ఇవతల హాల్లో సీనయ్య, అమ్ములు, వసంతా తింటూ ఉంటారు. నీలవేణి వడ్డిస్తూ ఉంటుంది. లక్కీ తన రూమ్‌లో చక్రీని అన్నం తినమని బతిమలాడుతుంది. కాంతమ్మ కూడా బతిమలాడటంతో.. చక్రీ మరీ బెట్టు చేస్తాడు. ‘నాకేం వద్దు’ అని గట్టిగా అరుస్తాడు. ఆ మాటలు అస్పష్టంగా సీనయ్యకు వినిస్తాయి. బయట ఉన్న అమ్ములు, నీలవేణిలు కంగారు పడతారు. ‘ఏంటా గొడవ?’ అని సీనయ్య రెట్టిస్తాడు. పక్కనే తింటున్న వసంత.. ‘ఏం లేదు నాన్నా.. చక్రీని నాన్నమ్మ తినమని బతిలాడుతోంది’ అని నిజం చెప్పేస్తుంది.

చెలరేగిపోయిన సీనయ్య!

సీనయ్య ఆవేశం రెట్టింపు అయిపోతుంది. ‘అమ్మా.. చాలా కష్టపడుతున్నావ్ అమ్మా నీ మనవడికి తినిపించడానికి. సిగ్గు లేకపోతే వాడు తింటాడు’ అంటూ నోటికి కొచ్చినట్లు మళ్లీ తిడతాడు. దాంతో కాంతమ్మ చేతిలోని కంచం.. ఎగిరి సీనయ్య ఉన్న హాల్లోకి పడుతుంది.(చక్రీనే విసిరి కొడతాడు) వెంటనే ఆవేశంగా బట్టలు సర్దుకుంటాడు. లక్కీ, కాంతమ్మ ఎంత చెబుతున్నా వినడు. ఇంతలో అమ్ములు, నీలవేణి కూడా చక్రీకి అడ్డుపడతారు. వసంత, ధనుష్‌(వసంత భర్త) కూడా ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ చక్రీ ఏ మాత్రం ఆగడు. బ్యాగ్ తీసుకుని హాల్లోకి వచ్చిన చక్రీని.. సీనయ్య మరింత రెచ్చగొడతాడు.

నన్ను కూడా తీసుకుని వెళ్లు చక్రీ!

‘వెళ్తాను వెళ్తాను కాదురా.. వెళ్లు’ అంటూ అరుస్తాడు సీనయ్య. లక్కీ కూడా ఏడుస్తూ చక్రీని బతిమలాడుతుంది. ‘నువ్వు ఆగకపోతే నన్ను కూడా తీసుకుని వెళ్లు నువ్వు ఎక్కడుంటే నేనూ అక్కడే ఉంటాను’ అంటూ వేడుకుంటుంది. అయితే చక్రీ ఆవేశంలో.. ‘వద్దమ్మా నువ్వు నా వెనుకే వస్తే.. నీ వాళ్లు.. ఈ మనిషి(సీనయ్య) ఊరుకుంటారా? తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టేశాడని అవమానించరూ?’ అంటూ అరుస్తాడు. మళ్లీ చక్రీనే మాట్లాడుతూ.. ‘అయినా నేను ఇన్నాళ్లు ఛీ అన్నా.. ఛా అన్నా.. ఇక్కడే పడి ఏడ్చింది ఎందుకు? ఆ మనిషి(సీనయ్య) కోసం కాదా?’ అంటూ బ్యాగ్ తీసుకుని ఎవరు ఆపుతున్నా ఆగకుండా బయలుదేరతాడు.

భరత్ ఎంట్రీ!

ఇంతలో భరత్ రావడంతో.. చక్రీ కాస్త తగ్గుతాడు. ‘ఏం జరుగుతుంది?’ అని భరత్ అడిగిన ప్రశ్నకు నీలవేణి విషయం చెబుతుంది. దాంతో భరత్ క్లాప్స్ కొడుతూ.. ‘వెళ్లిపో చక్రీ వెళ్లిపో.. తప్పు లేదు.. నువ్వు వెళ్లడంలో’ అంటాడు. అంతా షాక్ అవుతారు. ‘అదేంటి బాబూ అలా అంటున్నారు?’ అంటుంది కాంతమ్మ బాధగా.. ‘తప్పు లేదు.. చక్రీ చేసేదానిలో.. ఒకప్పుడు సీనయ్యగారు.. అమ్ముల్ని చీదరించుకుని, బయటికి గెంటేశారు. అప్పుడు కూడా అమ్ములు ఎన్నో కష్టాలు పడి ఇంటికోసం డబ్బు పంపేది. చివరికి తండ్రి ప్రేమని పొందగలిగింది. అమ్ములు పెళ్లి ఆగిపోయిందని కట్టుకున్న భార్య మీద పగబట్టాడు మీ నాన్న. కానీ ఎక్కడికి వెళ్లిపోకుండా తిరిగి ప్రేమని సంపాధించింది. వాళ్లకంటే పెద్ద కష్టమా నీదీ?’ అంటాడు భరత్.

చక్రీ ఆగడంతో అంతా హ్యాపీ!

భరత్ మాటలకు చక్రీ కూల్ అవుతాడు. ‘నువ్వే ఆలోచించుకో.. నువ్వు వెళ్లిపోతే వీళ్లంతా ఏం కావాలి? ఒక్కసారి మీ అమ్మ ముఖం చూడు.. నీ కోసం ఏడుస్తున్న వీళ్లందరీ చూడు.. ఒక్క మనిషి ధ్వేషాన్ని భరించలేక.. ఇంత మంది ప్రేమని దూరం చేసుకుంటావా?’ అంటాడు భరత్. దాంతో చక్రీ బ్యాగ్ వదిలిపెట్టి.. ‘ఇక నుంచి ఆ మనిషి(సీనయ్య)తో నేను మాట్లాడను. నిజంగానే నన్ను క్షమించానని చెప్పినా సరే నేను మాట్లాడను’ అంటూ ఆవేశంగా అక్కడ నుంచి వెళ్తాడు. వెంటనే వసంత.. ‘ఈ గొడవంతా ఈ అమ్ములు వల్లే వచ్చింది.. అసలు ఇది మెకానిక్ షెడ్‌లో పని చేసి డబ్బులు తెస్తుంది. దాంతో అందరూ వాడ్ని(చక్రీని) పనికిరాని వెదవా అంటున్నారు. మగాడు కదా పౌరుషం రాదా మరీ’ అంటుంది.

అమ్ములు నాకు కాబోయే భార్య!

వసంత చెప్పింది విన్న భరత్.. కోపంతో.. ‘ఏంటీ మావయ్యగారూ? అమ్ములు మెకానిక్ షెడ్‌లో పని చేయడం ఏంటీ? తను నాకు కాబోయే భార్య. తనని ఇలాంటి పనులు చేయిస్తారా? అసలు ఇదంతా కాదు మావయ్యగారూ.. రేపే మా అమ్మ వాళ్లని పిలుస్తాను. వీరభద్రస్వామి గుడిలో పెళ్లి చేసేయండి చాలు.. మీకు ఎలాంటి ఆర్థిక సాయం అయినా నేను చేస్తాను కదా?’ అంటాడు. ‘అది కాదు బాబు.. ఎవడో పరాయి వాడైన అంకిత్ మంచాన్న పడితేనే.. తట్టుకోలేక కోలుకునేదాకా పెళ్లి చేసుకోలేదు నా కూతరు. ఇప్పుడు నేనే ప్రాణం అనుకునే దానికి నేను మంచాన్నే ఉంటే.. అది(అమ్ములు) సంతోషంగా పెళ్లి చేసుకోగలదా? దాని సంతోషానికి వ్యతిరేకంగా ఏ పని చేయను బాబు’ అంటాడు సీనయ్య.

ఆర్థిక సాయం వద్దు బాబు!

వెంటనే నీలవేణి మాట్లాడుతూ.. ‘మీ నుంచి ఏ ఆర్థిక సాయం ఇక వద్దు బాబూ.. ఇప్పటి దాకా చేసింది చాలు. ఇప్పుడు మీ దగ్గర మేము సాయం పొందితే నా కూతురు ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది. అది ఆదర్శంగా నిలబడి ఈ కుటుంబాన్ని పోషిస్తోంది. దానికి మేమంతా తోడుగా ఉంటాం. అంతే కానీ.. మీ నుంచి సాయం పొంది దాన్ని అవమానించలేము’ అంటుంది నీలవేణి. దాంతో భరత్ ఎటూ మాట్లాడలేక.. ‘మీ ఇష్టమే నా ఇష్టం’ అంటాడు. వెంటనే.. ‘నేను అమ్ములుతో మాట్లాడాలనుకుంటున్నాను’ అంటూ పక్కకు తీసుకుని వెళ్లి.. ‘చూడూ ఇప్పుడు తప్పించుకున్నానని సంబరపడకు.. ఎప్పటికైనా నీ మెడలో తాళి కట్టేది నేనే. జాగ్రత్తగా ఉండు’ అని వార్నింగ్ ఇస్తాడు. అమ్ములు కోపంగా చూస్తుంది.

అంకిత్‌కి చివాట్లు!

అంకిత్ నందిని దగ్గరకు వెళ్లి.. ‘అమ్మా.. నేను ఓ ఫ్రెండ్‌కి సాయం చెయ్యాలనుకుంటున్నాను.. నువ్వు ఏం అంటావ్?’ అంటాడు. దానికి నా పర్మీషన్ ఎందుకురా? చెయ్యి అంటూనే.. ‘ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు?’ అని అడుగుతుంది నందిని. అంకిత్ తప్పని స్థితిలో ‘అమ్ములు’ అని చెబుతాడు. దాంతో నందిని అంకిత్‌ని బాగా తిడుతుంది. ‘అమ్ములుకీ అమ్ములు కుటుంబానికి సాయం చేయడానికి ఆ భరత్ ఉన్నాడుగా.. నువ్వు కలుగజేసుకోవద్దు’ అని చివాట్లు పెడుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! మౌనరాగం కొనసాగుతోంది.