ఇస్మార్ట్ బ్యూటీ పై ఆ గుసగుసలు నిజమేనా?

`ఇస్మార్ట్ శంకర్` సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన కన్నడ భామ నభా నటేష్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ విజయం తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులు అందుకుంది. అయితే అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. `డిస్కోరాజా`..`అల్లుడు అదుర్స్`..`మాస్ట్రో` చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అన్ని పెద్ద ప్రాజెక్ట్ లే. కానీ వైఫల్యాలు అమ్మడిని వెనక్కి నెట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ అవకాశాలు కోసం ఎదురు చూస్తుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటూ ఇన్ స్టాని హీటెక్కిస్తుంది. మరి ఒక్కసారిగా స్కైని టచ్ చేసిన నభా నటేష్ ఎందుకు డౌన్ అయిందంటే ఓ కారణం వైరల్ గా మారింది.

`ఇస్మార్ట్ శంకర్` బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ బ్యూటీ పారితోషికం భారీగా పెంచేసిందని గుసగుసలు వినిపించాయి. `ఇస్మార్ట్ శంకర్` తర్వాత చేసిన సినిమాలన్నింటికి భారీగానే ఛార్జ్ చేసిందని టాక్ వినిపిస్తుంది. ఈ కారణం సహా.. వరుస పరాజయాలు ఉన్న హీరోయిన్ ఎంపిక చేసుకుని ఏం లాభం అని భావించి దర్శక.. నిర్మాతలు దూరం పెట్టినట్లు వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఏంటో తెలియాలి. ఏదేమైనా నభా కెరీర్ పై ఇది ఓ మచ్చ అనే అంటున్నారు. అందం.. అభినయం గల హీరోయిన్. యూత్ లో మంచి పాలోయింగ్. అయినా ఇలా వెనుకబటడానికి కారణం పారితోషికం కాకుండా ఇంకేం ఉంటుందనే టాక్ యూత్ లో బలంగా వినిపిస్తోంది.

మరి వీటిని నభా ఎలా బ్రేక్ చేసి ముందుకు వెళ్తుంది? అన్నది చూడాలి. తొటి హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రం కెరీర్ ని చక్కగా బిల్డ్ చేసుకుని ముందుకు సాగిపోతోంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ అయితే నిధి కెరీర్ కి తిరుగుండదు. అటు యువ హీరోలతోనూ నిధి అగర్వాల్ సినిమాలు చేస్తోంది.