రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో థియేటర్లు ఉండక పోవచ్చు, కేవలం మల్టీఫ్లెక్స్ ఉంటాయి అంటూ ప్రముఖ నిర్మాతలు గత కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. రాబోయే కాలం అంతా కూడా ఓటిటి దే అంటూ సినీ ప్రముఖులు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. రాబోయే పదేళ్ల లో కాదు కరోనా కారణంగా ఇప్పుడే ఆ పరిస్థితి వచ్చేలా ఉంది.
గత రెండు నెలలుగా థియేటర్లు పూర్తిగా బంద్ ఉన్నాయి. అవి మళ్ళీ ఎప్పటికి తెరచుకునేనో అర్ధం కాని పరిస్థితి. ఒకవేళ థియేటర్స్ కు అనుమతించిన కూడా మళ్ళీ ప్రేక్షకులు వస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో థియేటర్లకు మళ్ళీ ప్రేక్షకులను తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరికీ తోచిన సలహాలు వారు ఇస్తున్నారు. తాజాగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక ఆలోచనతో వచ్చాడు.
విదేశాల్లో ఉన్న డ్రైవ్ ఇన్ థియేటర్ విధానం ను ఇక్కడ కూడా తీసుకు రావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ మధ్య కాలంలో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. అలాగే థియేటర్లు కూడా అలాగే మొదలు పెట్టాలని అన్నాడు. అయితే ఇది ఎలా వర్కౌట్ అయ్యెను అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించగా కొత్త ఎక్స్పీరియన్స్ కోసం అయినా వస్తారంటూ నాగ్ అశ్విన్ నమ్మకం వ్యక్తం చేశాడు.
విదేశాల్లో సక్సెస్ అయిన ఈ విధానం ఇక్కడ సక్సెస్ అవ్వడం నమ్మకం తక్కువే అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో మొదటి డ్రైవ్ ఇన్ థియేటర్ అతి త్వరలోనే ప్రారంభం అవుతుందేమో అనే నమ్మకం కొందరు వ్యక్తం చేస్తున్నారు.