నాగ చైతన్య సినిమా అటకెక్కినట్లేనా?

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే గతేడాది మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా చేస్తాడని అధికారికంగా వెల్లడైంది.

దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ అటకెక్కినట్లే అని అంటున్నారు. ప్రస్తుతం చైతన్య ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. థాంక్యూ పూర్తయ్యాక బంగార్రాజు చిత్రంలో నటించాల్సి ఉంది. అలాగే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నటించడానికి ఎస్ చెప్పాడు. సో, ఈ ఆప్షన్స్ మధ్య మోహన్ కృష్ణ ఇంద్రగంటి సినిమాను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ దర్శకుడు సుధీర్ బాబుతో సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నాడు.