నాగ చైతన్య మాత్రం ఎక్కడా తగ్గట్లేదుగా!

అక్కినేని నాగచైతన్య హీరోగా ఇప్పుడు మంచి ఫేజ్ లో ఉన్నాడు. వరసగా సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చిత్రంలో నటించాడు. కోవిద్ సెకండ్ వేవ్ రాకపోయి ఉంటే ఈపాటికి లవ్ స్టోరీ విడుదలైపోయి ఉండేది.

ప్రస్తుతం నాగ చైతన్య థాంక్యూ చిత్రంలో నటిస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్నీ కోవిద్ కారణంగా నిలిచిపోయిన సంగతి తెల్సిందే. అయితే థాంక్యూ షూటింగ్ మాత్రం శరవేగంగా సాగుతోంది.

ఇటలీలో ఈ సినిమా షూటింగ్ ను ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు. విక్రమ్ కుమార్ మరోసారి విభిన్నమైన కథాంశంతో మన ముందుకు రానున్నాడు. అయితే విక్రమ్ డైరెక్ట్ చేసిన గత రెండు సినిమాలు సరిగా ఆడలేదు. ఈ నేపథ్యంలో థాంక్యూ చిత్రంతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. రాశి ఖన్నా ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నటిస్తోంది.