థాంక్యూ చిత్ర షూటింగ్ ను హోల్డ్ లో పెట్టిన నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. లవ్ స్టోరీ పూర్తి చేసిన తర్వాత నాగ చైతన్య థాంక్యూ చిత్రానికి మూవ్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కూడా మెజారిటీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

మరో వారం రోజుల షూటింగ్ మిగిలి ఉంది ఈ చిత్రానికి. జులై మొదటి వారంలో థాంక్యూ షూటింగ్ ను పూర్తి చేసేస్తాడు అనుకున్నారు అందరూ. కానీ కారణాలు తెలియదు కానీ నాగ చైతన్య ఇప్పుడు బాలీవుడ్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు.

ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్ర షూటింగ్ లో చైతన్య పాల్గొనాలి. ఈ రోల్ కోసం వెయిట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. దాదాపు 20 రోజుల పాటు ఈ చిత్రానికి పనిచేయనున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత థాంక్యూ చిత్రాన్ని పూర్తి చేస్తాడట చైతన్య.