నాగ చైతన్య సరసన పూజ హెగ్డే?

పూజ హెగ్డే ఫామ్ ఇప్పుడు మాములుగా లేదు. వివిధ భాషల్లో వరసగా చిత్రాలను చేస్తోంది. విజయ్ సరసన బీస్ట్ లో నటించిన పూజ ఇప్పుడు తెలుగు లో ఒకటి, హిందీలో ఒకటి చిత్రాలను ఎంచుకుంది. తెలుగులో మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ సరసన భాయిజాన్ లో కూడా నటించనుంది. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ కూడా ఏప్రిల్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కాకుండా ఇప్పుడు పూజ హెగ్డే తెలుగు – తమిళ్ ద్విభాషా చిత్రాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముంది.

ఈ చిత్రం కోసం పూజ హెగ్డేను అప్రోచ్ అవ్వగా పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను సైన్ చేసే అవకాశముంది.