నాగ శౌర్య కృష్ణ వ్రిందా విహారి కూడా వాయిదా!!

ఏప్రిల్ 22న మూడు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. సుమ కనకాల నటించిన జయమ్మ పంచాయతీ, విశ్వక్ సేన్ చేసిన ఆకాశ వనంలో అర్జున కళ్యాణం, నాగ శౌర్య కృష్ణ వ్రిందా విహారి సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే కేజిఎఫ్ చాప్టర్ 2 మేనియా ఉండగా చిన్న సినిమా వస్తే అది చిత్రానికి ఎంత ప్రమాదకరం అనేది ఈ నెలలోనే విడుదలైన చిన్న సినిమాలు చూపించాయి.

దాంతో ఇప్పటికే జయమ్మ పంచాయతీ, ఆకాశ వనంలో అర్జున కళ్యాణం చిత్రాలు మే మొదటి వారానికి వాయిదా పడ్డాయి. ఇప్పుడు అదే కోవలోకి కృష్ణ వ్రిందా విహారి చేరింది. ఈ చిత్రం ఏప్రిల్ 22 నుండి మే మూడో వారానికి వాయిదా పడింది. త్వరలోనే చిత్ర విడుదలను అధికారికంగా ప్రకటిస్తారు.

షేర్లే సెటియా ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. అనీష్ ఆర్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.