హైపర్‌ ఆదిపై నాగబాబు అదిరిపోయే పంచ్‌

జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది ప్రస్తుతం ట్రెండ్డింగ్‌ కమెడియన్‌ అనడంలో సందేహం లేదు. షో లో అతడి కామెడీ స్కిట్‌ ను చూసేందుకు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నాగబాబుకు కూడా ఆది అంటే అభిమానం అనే విషయం గతంలో ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. కాని నాగబాబు ఎప్పుడైతే జబర్దస్త్‌ నుండి వెళ్లి పోయాడో అప్పటి నుండి జబర్దస్త్‌ కమెడియన్స్‌ పై సున్నితంగా విమర్శించడం చేస్తున్నాడు. తనతో జీ తెలుగుకు రాలేదన్న కోపమో లేదా మరేంటో కాని మొన్న సుధీర్‌ మరియు నిన్న ఆదిలపై నాగబాబు కామెంట్స్‌ చేశాడు.

సుధీర్‌ పై మీ అభిప్రాయం ఏంటీ అంటే ఎంతో మంది సుధీర్‌ లు ఉన్నారు అందులో ఏ సుధీర్‌ అంటూ నాగబాబు కామెంట్‌ చేయడం తెల్సిందే. ఇక నాగబాబు తాజాగా హైపర్‌ ఆది గురించి ఏమైనా చెప్పండి అంటూ సోషల్‌ మీడియాలో కొందరు నాగబాబును అడిగిన సమయంలో.. గుడ్‌ బట్‌ హి మస్ట్‌ అప్ డేట్‌ ఇన్‌ కామెడీ అంటూ సున్నితంగా కౌంటర్‌ వేశాడు. హైపర్‌ ఆది మూస తరహా కామెడీ చేస్తున్నాడు అంటూ నాగబాబు ఇండైరెక్ట్‌ గా కామెంట్స్‌ చేశాడు. నాగబాబు ముందు ముందు మరెంత మందిపై కామెంట్స్‌ చేస్తాడో చూడాలి.