నాగబాబు ‘ఘంటసాల’ కౌంటర్‌ ఎవరికో అర్థం అయ్యిందా.?

నాగబాబు ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ యూట్యూబ్‌ ఇలా ఎన్నో సామాజిక మాద్యమాల ద్వారా నాగబాబు తన ఫాలోవర్స్‌తో రెగ్యులర్‌గా ఏదో ఒక విషయమై ముచ్చటిస్తూనే ఉన్నాడు. తాజాగా నాగబాబు పార్టీల పరంగా రాజకీయాలపై కూడా ట్విట్టర్‌లో రెగ్యులర్‌గా పోస్ట్‌లు చేస్తున్న విషయం తెల్సిందే. ఆ మద్య స్టార్‌ హీరోపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపాయి. తాజాగా మరోసారి నాగబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

నాగబాబు ట్విట్టర్‌లో… ఒక్కోసారి ఓల్డ్‌సాంగ్స్‌ రీమిక్స్‌ కన్నా ఒరిజినల్స్‌ చాలా అద్బుతంగా ఉంటాయి. ఈ తరానికి ఘంటసాల గాత్ర మాధుర్యం విలువ ఈపాటికి తెలిసుంటుంది అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ ఎవరి గురించి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగబాబు ట్వీట్‌కు యాంటీ ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. నీకు ఘంటసాల గురించి మాట్లాడే స్థాయి ఉందా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరికొందరు నాగబాబుకు మద్దతుగా కూడా మాట్లాడుతున్నారు. ఘంటసాల గొప్పతనం ఏంటో తెలియడంతో పాటు ఎవరి ప్రతిభ ఏంటీ అనే విషయం కూడా ఈపాటికి తెలిసిందని, తమ స్థాయిని ఎక్కువగా ఊహించుకుంటే ఏమవుతుందో కూడా వారికి తెలిసే ఉంటుందని నాగబాబుకు మద్దతుగా మెగా ఫ్యాన్స్‌ పోస్ట్‌లు పెడుతున్నారు. మొత్తానికి నాగబాబు ఘంటసాల కౌంటర్‌ నెట్టింట చర్చనీయాంశం అయ్యింది.