నాగార్జున ఘోస్ట్ లో `ఏజెంట్` అఖిల్

కింగ్ నాగార్జున ఇటీవల బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ జానర్ చిత్రాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. నవతరం హీరోలకు పోటీగా కాకుండా వైవిధ్యమైన కథలు.. పాత్రలను ఎంపిక చేసుకుని నాగ్ పరుగులు తీస్తున్నారు. మార్కెట్ లో తనదైన బ్రాండ్ తో సక్సెస్ అయ్యే జానర్లని నాగ్ టచ్ చేస్తున్నారు. కమర్శియల్ గా సినిమాలు వర్కౌట్ అయ్యేలా పక్కా ప్లాన్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. హారర్ జానర్ మూవీ `రాజుగారి గది-2` లో రుద్ర పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. నాగార్జున లాంటి స్టార్ అలాంటి పాత్ర పోషించడంతో సినిమాకు మైలేజ్ దక్కింది. ఇప్పుడు అలాంటి మరో డిఫరెంట్ ప్రయత్నం చేస్తున్నారు. నాగార్జున మరోప్రయోగానికి పూనుకున్నట్లు తెలుస్తోంది.

కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో `ఘోస్ట్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది హారర్ థ్రిల్లర్ చిత్రమని ఫస్టు లుక్ మోషన్ పోస్టర్ తోనే అర్ధమైంది. పోస్టర్ డిజైన్ ఆద్యంతం ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ వైట్ లో డిజైన్ చేసిన పోస్టర్ లో నాగార్జున లుక్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తొలి పోస్టర్ లుక్ తోనే ఘోస్ట్ పై బెస్ట్ ఇంప్రెషన్ పడింది. థ్రిల్లర్..సస్పెన్స్ అంశాలు హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో అక్కినేని అఖిల్ కూడా భాగమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అఖిల్ ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

మరి ఈ ఛాన్స్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కల్పించారా? లేక కింగ్ ఆఫర్ చేసారా? అన్నది తెలియాలి. మల్టీస్టారర్ ట్రెండ్ లో తండ్రులతో వారసులు కలిసి నటించడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న `ఆచార్య`లో కుమారుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిల్ ముందుకు వచ్చాడా? అన్న సందేహం రాక మానదు. ఇటీవలే అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` తో తొలి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.