ఫోటో స్టోరి: నైనాకు ఆర్జీవీ నేర్పిన విద్య ఇదేనా?

ఆర్జీవీ డీ- కంపెనీ నాయికగా ఇప్పటికే నైనా గంగూలీ పేరు మార్మోగుతోంది. ఇటీవల కొంతకాలంగా ఈ బ్యూటీ నటించిన సినిమాలేవీ రిలీజ్ కాకపోయినా నిరంతరం వేడెక్కించే ఫోటోలు వీడియోలతో అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది.

తాజాగా నైనా బోల్డ్ ఫోటో ఒకటి యువతరంలో హీటెక్కిస్తోంది. అలా లాంజ్ లో చైర్ లో రిలాక్స్ డ్ గా కూచున్న నైనా తన నునుపైన కాళ్ల సౌందర్యాన్ని ప్రదర్శిస్తోందిలా. ముఖ్యంగా ఆ థై ఎలివేషన్ అగ్గి రాజేస్తోంది. నిజానికి ఇంతకుముందు జిమ్ చేస్తూ యోగా చేస్తూ లేదా ఆర్జీవీతో క్లోజ్ గా మూవ్ అవుతూ రకరకాల భంగిమల్ని ఆవిష్కరించినా కానీ ఇది నెవ్వర్ బిఫోర్ అన్నంతగా వైరల్ అవుతోంది. ఇక ఈ ఫోటోకి కామెంట్లు అదే రేంజులో వినిపిస్తున్నాయి. నైనాకు ఆర్జీవీ నేర్పిన విద్య ఇదేనా? అంటూ యూత్ ప్రశ్నిస్తోంది.

ఆర్జీవీ రూపొందించిన `బ్యూటిఫుల్` చిత్రంలో కాకలు పుట్టించే రేంజులో చెలరేగిన ఈ బ్యూటీ ఆర్జీవీకే చెందిన డీకంపెనీ రూపొందించిన `డేంజరస్` అనే మూవీలోనే లెస్బియన్ గా నటిస్తోంది. `జోహార్` అనే వేరొక మూవీలోనూ నాయికగా నటించింది. చరిత్రహీన్ అనే వెబ్ సిరీస్ ఫ్రాంఛైజీ నాయికగానూ నైనా కొనసాగుతోంది. ఇండస్ట్రీలో బోల్డ్ కంటెంట్ తో చెలరేగే బ్యూటీగా నైనా పాపులరైంది.