తిరుమలలో రెండు విషయాలపై క్లారిటీ ఇచ్చిన నమిత

తెలుగు ప్రేక్షకులకు నమిత సుపరిచితురాలు. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించడంతో పాటు ఐటెం సాంగ్స్ ను కూడా చేసి మెప్పించింది. ఈమె చేసిన సింహా లోని పాత్ర ను ప్రేక్షకులు ఇప్పటికి గుర్తు పెట్టుకున్నారు. ఇక ఈమె ఈమద్య కాలంలో నటిగా కాస్త సైలెంట్ అయ్యింది. మళ్లీ ఈమె నటిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా నమిత బిజీ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. నమిత ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో వరుసగా సినిమాలను నిర్మించేందుకు సిద్దం అవుతోంది. సినిమా షూటింగ్ లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించేందుకు కథలు వింటున్నట్లుగా నమిత చెబుతోంది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించిన నమిత ఆ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న రెండు వారాలపై క్లారిటీ ఇచ్చింది. మొదటిది నమిత థియేటర్స్ పేరుతో ఓటీటీని మొదలు పెడుతున్న విషయాన్ని ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను ఓటీటీ ని మొదలు పెడుతున్నట్లుగా ప్రకటించింది. ఇక నమిత ఓటీటీ లో చిన్న సినిమాలతో పాటు షో లు మరియు వెబ్ సిరీస్ ను కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా చెప్పింది.

ఓటీటీ లు ఇప్పటికే చాలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో నమిత ఓటీటీ ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది కాస్త చర్చనీయాంశంగా మారింది. సౌత్ లో క్రేజ్ ఉన్న బ్యూటీ కనుక తమిళం మరియు తెలుగు భాషల కంటెంట్ లతో పాటు ఇతర సౌత్ భాషల కంటెంట్ ను కూడా నమిత ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందట. నమిత ఇకపై వరుసగా సినిమాలను చేయడంతో పాటు కొత్త నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులతో సినిమాలను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరి ఈమె బ్యానర్ మరియు ఓటీటీ లు ఎంత వరకు సక్సెస్ అవుతాయి అనేది చూడాలి.