లాక్ డౌన్ సమయాన్ని పెర్ఫెక్ట్ గా ఉపయోగించుకున్న నాని టీమ్

న్యాచురల్ స్టార్ నాని వరస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. నాని నెగటివ్ షేడ్ లో నటించిన V సినిమా రిలీజ్ ముంగిట ఆగిపోయింది. థియేటర్లు క్లోజ్ అయిపోవడంతో V విడుదల కాలేదు. ఈ సినిమా కాకుండా నాని టక్ జగదీష్ చిత్రంలో కూడా నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. నానితో మజిలీ చిత్రాన్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. రీతూ వర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం లాక్ డౌన్ సమయాన్ని టక్ జగదీష్ టీమ్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తైన 40 శాతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు టక్ జగదీష్ టీమ్ పనిచేసినట్లు సమాచారం. ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులను పూర్తి చేశారట. ఒకసారి షూటింగ్ లు మొదలైతే మిగిలిన భాగం త్వరగా పూర్తి చేయొచ్చన్న ఆలోచనతో పోస్ట్ ప్రొడక్షన్ పనులపై వర్క్ చేసారు.