‘వి’ ట్రయిలర్ ట్రోలింగ్

ఏదైనా సినిమా ట్రయిలర్ వదిలితే అప్పుడు బాగుంది, లేదా బాగులేదు అన్న పాయింట్. ట్విట్టర్ లో ట్రోలింగ్ వగైరా. కానీ చిత్రంగా, వి సినిమాకు మాత్రం ట్రయిలర్ వదలడంపై ట్రోలింగ్ మొదలైంది. ఇక్కడ తప్పు ఏదీ లేదు. ఫ్యాన్స్ ఆలోచనలు అందుకోకుండా అమెజాన్ ప్రయిమ్ చేసిన ఓ ప్రయోగం ఇందుకు కారణం.

ఫ్యాన్స్ లో సినిమా మీద ఆసక్తి పెంచడానికి వీలుగా, ట్రయిలర్ మీరే విడుదల చేయొచ్చు, దానికి ఇలా చేయండి అంటూ ఓ ప్రొసీజర్ ను ప్రకటించింది. ఓ సైట్ లోకి వెళ్లడం, దాంట్లో విక్టరీ సింబల్ చూపిస్తూ సెల్ఫీ తీసుకుని అప్ లోడ్ చేయడం ఇలా..

ఇదిగో, సరిగ్గా ఈ వ్యవహారం మీదేనే ఫ్యాన్స్ కు కోపం వచ్చింది. ఫలానా టైమ్ కు ట్రయిలర్ అంటూ ఇచ్చేస్తే, వెంటనే చూసేయచ్చు అన్నది అభిమానుల కోరిక , ఆత్రుత. అలా కాకుండా ఇలా ఓ ప్రోసీజర్ ప్రకటించేసారికి అమెజాన్ ప్రయిమ్ విడియో ట్విట్టర్ అక్కౌంట్ కింద రెచ్చిపోయి ట్రోలింగ్ కామెంట్లు, మీమ్స్ తో సందడి సందడి చేసారు.

మరి ఇది చూసి ట్రయిలర్ విడుదల వ్యవహారాన్ని చకచకా చేపడతారో, ఏం చేస్తారో చూడాలి. అయితే నాని ఫ్యాన్స్ హడావుడి కాదు ఇదంతా, వేరే హీరో ఫ్యాన్స్ గ్రూప్ హడావుడి ఇది అని కూడా వినిపిస్తోంది. మొత్తం మీద వి సినిమా విడుదలకు ఇవన్నీ కలిసి బాగానే బజ్ తెస్తున్నాయి. తమ ప్లాన్ సూపర్ సక్సెస్ అయిందని అమెజాన్ ప్రయిమ్ ప్రకటించింది.