మినిమం నాలుగేళ్లు మాట్లాడుకోవాలంటున్నాడు

nenu-localపండగపూట కొత్తగా ఉంటుందని నాని లేటెస్ట్ మూవీ..  “నేను లోకల్” ట్రైలర్ విడుదలైంది. మాటల మాయాజాలంతో ఒక్కసారి ట్రైలర్ ను చూసినోళ్లు మినిమం మరోసారి చూసేలా కట్ చేయటంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. రెండు నిమిషాలకు తొమ్మిది సెకన్లు తక్కువగా ఉన్న ఈ ట్రైలర్ లో కట్ చేసిన ప్రతి సీన్.. సినిమా మీద ఆసక్తిని పెంచేసేలా చేశారు.

చాలా సీరియస్ టోన్ లో నాని.. “ఒక అమ్మాయి తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకుంటోందంటే అది మార్చి అని అర్థం. ఒక అబ్బాయితెల్లవారుజామున 4 గంటలకులేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్ అని అర్థం. ద రిలేషన్ షిప్ బిట్విన్ మార్చి అండ్ సెప్టెంబర్ షుడ్ బి లైక్ ఎ ఫిష్” అంటూ చెబుతుంటే.. ‘రేయ్’.. అంటూ గాండ్రిపు వినిపించటం.. నాని డంగై.. ఆ..అంటూ సాగదీసిన సీన్ చూస్తేనే అర్థమవుతుంది సినిమాలో ఫన్ బోలెడంత అని.

దీని వెంట వచ్చే మరోసీన్ గురించిచెప్పాల్సిందే. అమ్మా..నాన్నా.. మీ కోసం ఎంబీఏ చదువుతాను. కాలేజీకి వెళతాను.అమ్మాయిని ఫాలో అవుతానంటూ పేరెంట్స్ కు షాకిచ్చే మాటలు నాని నోట విన్నప్పుడు.. ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీనే కాదు.. ఎనర్జటిక్ గా ఉంటుందన్న భావన కలగటం ఖాయం. డైలాగులతో నవ్వులే నవ్వులేనన్న విషయాన్ని చెప్పేస్తున్న ‘నేను లోకల్’ మూవీ టీజర్ విడుదలైంది. నాని హీరోగా.. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం  వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతో నానికి లవ్వర్ బాయ్ ఇమేజ్ ను మరింత పెంచేసేలా ఉంది.

కీర్తి సురేశ్ ను లవ్ లోకి దింపే సీన్లకు సంబంధించిన శాంపిల్ గా కట్ చేసిన నాలుగైదు సీన్లు చూస్తేనే.. సినిమా మీద ఆసక్తి రెట్టింపు అయ్యేలా చేశాయి. ‘వీడు మామూలోడు కాదే. జండూబామ్ కు కూడా తలనొప్పి తెప్పించే రకం’ అంటూ హీరోయిన్ కీర్తిసురేశ్ తండ్రి క్యారెక్టర్ చేత చెప్పించిన డైలాగ్ తో నాని ఈ సినిమాలో ఎంత అల్లరోడో అర్థం అవుతుంది. కొన్ని సెకన్లనుమినహాయిస్తే రెండు నిమిషాలున్న ఈ ట్రైలర్ లో నిమిషం కామెడీ.. కామెడీ లాగించేసి.. మలి సగం మొత్తం యాక్షన్ తో నింపేసి సినిమాలో అన్నీ ఉంటాయి సుమాఅన్న విషయాన్ని చెప్పేశారు.

“మన బ్యాచ్ లో లవ్ స్టోరీలు.. ఛేజింగ్ లు.. పోలీసులు లేవని తెగ ఫీలైపోతున్నారు.ఇక..బాబుగాడి లవ్ స్టోరీని మినిమం నాలుగేళ్లు మాట్లాడుకోవాలి” అంటూ ఈ మూవీ ఎంత డిఫరెంట్ గా ఉంటున్న విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు నాని. మరి.. అంతలా మాట్లాడుకునేలా చేస్తాడో లేదో అన్నది సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.