వారసత్వ రాజకీయాలు దేశానికి పెను ముప్పు

దేశ ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు పెను ముప్పుగా దాపరించాయి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొత్త వారు రాజకీయాల్లోకి వచ్చిన సమయంలోనే ఈ పెను ముప్పు నుండి దేశంను కాపాడిన వాళ్లం అవుతామని ఈ సందర్బంగా ఆయన అన్నారు. యువజన పార్లమెంటు ముగింపు వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో వారసులు ఉండటం వల్ల ప్రజాస్వామ్యం దెబ్బ తింటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

తమ పూర్వీకులు తప్పులు చేసి శిక్షలు పడకపోగా వారి వారసులుగా వచ్చిన వారు సైతం తమ పూర్వీకులు ఏం తప్పు చేసినా శిక్ష పడలేదు కనుక తాము తప్పులు చేస్తాం అన్నట్లుగా వారసులు ఉంటారు. కనుక దేశంకు వారసత్వ రాజకీయం వద్దని యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలంటూ మోడీ పిలుపునిచ్చారు. ఒకప్పుడు యువత అవినీతి రాజకీయాలను మార్చలేమని అనుకున్నారు. కాని కొత్త వారు రావడం వల్ల చాలా పెద్ద ఎత్తున అవినీతికి అడ్డు కట్ట పడిందని అన్నారు. వారసత్వంతో సంబంధం లేని యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే దేశం పురోగమిస్తుందని మోడీ పేర్కొన్నారు.