టికెట్ వర్సెస్ నట్టి! పాత రేట్లకే అమ్మేస్తున్నారా?

వకీల్ సాబ్ రిలీజ్ ముందు ఆంధ్రప్రదేశ్ లో ట్విస్టు గురించి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను సవరిస్తూ కొత్త జీవోని తీసుకు వచ్చింది. అయితే సవరించిన తగ్గింపు ధరలతో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని చాలా మంది ఆరోపించారు. కానీ చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఉన్న నట్టి కుమార్ మాత్రం దీనిని ఖండించారు. ఏపీ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తూ సవరించిన ధరలే కరెక్ట్ అన్నారు.

అయితే ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసినా చాలా చోట్ల సవరించిన ధరలతో కాకుండా పాత టిక్కెట్టు ధరలనే కంటిన్యూ చేస్తున్నారని ప్రజా దోపిడీ జరుగుతోందని నట్టి ఆరోపిస్తూ కోర్టకు వెళ్లిన సంగతి తెలిసిందే. పాత ధరలకే అమ్ముతున్నారన్న ప్రూఫ్ లను సంపాదించిన అతడు కోర్టులో దీనిపై వాదించనున్నారు. ఇలా డేరింగ్ గా అమ్మేందుకు ఎగ్జిబిటర్లు రకరకాల మార్గాల్ని అనుసరిస్తున్నారన్నది నట్టి ఆరోపణ. దీనిపై 4 అక్టోబర్ న కోర్టు కేసు హియరింగ్ వుందని తెలుస్తోంది. సవరించిన జీవో అమలు కావడం లేదంటూ ఆయన ప్రూవ్ చేయనున్నారట. టిక్కెట్టుపై సాక్ష్యాలన్నీ సమీకరించిన అతడు ఇప్పుడు వార్ కి సిద్ధమయ్యాడు.

ఇకపోతే ఇటీవలే ఏపీ మంత్రి పేర్ని నాని ఛాంబర్ వర్గాలు సహా సినీపెద్దలు ఎగ్జిబిటర్లు పంపిణీ వర్గాలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో టిక్కెట్టు పెంపుపైనా చర్చించారు. పాజిటివ్ గా స్పందించారంటూ ఛాంబర్ సహా ఇతర వర్గాలు కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేశాయి. కానీ ఇప్పుడు నట్టి పిటింగ్ వల్ల ఏం జరుగుతోందోనన్న ఆందోళన నెలకొంది.

అన్నట్టు వైజాగ్ లో లీలా మహాల్ సహా పలు థియేటర్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న నట్టికి టిక్కెట్టు ధర ఎలా గిట్టుబాటు అవుతున్నట్టు? మరీ ఇలా మొండిగా అతడు సవరించిన ధరలకే మద్ధతు పలుకుతున్నారు? అన్న సందేహాలు కలుగుతున్నాయి. చూస్తుంటే సోనూసూద్ పై ఆదాయపన్ను దాడిలా నట్టిపైనా ఐటీ దాడులకు ఆస్కారం ఉందా? అంటూ ఒక సెక్షన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.