మనసు నుంచి ప్రేమ జ్ఞాపకాలనే కాదు…భౌతికపరమైన గుర్తులను కూడా చెరపేసుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభించారామె. నయనానందకరంగా కనిపించే ఆ తారే నయనతార. పేరుకు తగ్గ అందాన్ని సొంతం చేసుకుని దక్షిణాదిలో అగ్రహీరోయిన్‌గా రాణిస్తున్నారామె.
కొరియో గ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన దశలో…తమ మధ్య గాఢమైన అనుబంధానికి గుర్తుగా నయన్ అతని పేరును పచ్చబొట్టు పొడిపించుకుంది. అప్పట్లో ఇదో సంచలనం. ప్రభుదేవా పేరుని సగం ఇంగ్లీష్‌లో, మిగిలిన సగాన్ని తమిళంలో పచ్చబొట్టు వేయించుకుంది. అయితే వాళ్ల మధ్య ప్రేమ ఎక్కువ కాలం సాగలేదు. కానీ ప్రేమకు గుర్తుగా పొడిపించుకున్న పచ్చబొట్టు మాత్రం నిత్యం ఆమెని వెక్కిరిస్తూ వెంటాడుతూనే ఉంది.
తాజాగా నయన్ షేర్ చేసిన ఫొటొలో టాటూలో ప్రభుదేవాకు సంబంధించిన ఆనవాళ్లకు చెరిపేసినట్టు కనిపిస్తోంది. ఆ పేరు రీడిజైన్ చేయించి పాజిటివిటీగా మార్చి సరికొత్త నయనతారగా కనిపిస్తున్నారామె. నయన్‌లో వచ్చిన ఈ మార్పుపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుదేవా, శింబులతో తమ అభిమాన తార ప్రేమ విఫలమై…తాజాగా సినిమాలపై పూర్తిగా నిమగ్నం కావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.