నయన్ లో నచ్చే లక్షణాలు చెప్పిన విగ్నేష్ శివన్

సౌత్ ఇండియన్ టాప్ నటి నయనతార తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది నయన్. ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే.

వీరిద్దరూ గత కొన్నాళ్లుగా ఎక్కడపడితే అక్కడ చక్కర్లు కొడుతోన్న విషయం తెల్సిందే. స్పెషల్ ఫ్లయిట్స్ లో వీరు తిరుగుతున్నారు. క్రిస్మస్, న్యూఇయర్, ఓనం, నయనతార తల్లి పుట్టినరోజు వేడుకలకు కేరళ వెళ్లారు ఈ జంట. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు వీరి పోస్ట్ ల ద్వారా అభిమానులకు అర్ధమైంది.

ఇదిలా ఉంటే విగ్నేష్ శివన్ ఇటీవలే అభిమానులతో ముచ్చటించాడు. ఇందులో ఎక్కువగా ప్రశ్నలు నయనతార గురించే ఉన్నాయి. మీ ఇద్దరి ఫెవరెట్ పిక్చర్ ఏంటి, నయన్ బెస్ట్ ఫోటో పోస్ట్ చేయండి అంటూ అడిగారు. అలాగే ఒక నెటిజెన్ నయన్ లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి అని ప్రశ్నించగా ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నాకు చాలా ఇష్టమని తెలిపాడు.