కొంటె పనితో నెటిజనులకు షాక్ ట్రీటిచ్చిన ప్రియుడు!

నటి నయనతారతో దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమాయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. పలు ప్రేమ కథా చిత్రాల కోసం పని చేశాక నయన్ .. విఘ్నేష్ తో లాక్ అయిపోయారు. కొన్నేళ్లుగా ఈ జంట హాయిగా ప్రేమైక జీవనంలో ఉన్నారు. ప్రేమగువ్వలు సన్నిహితంగా ఉన్న ఫోటోలు.. విదేశీ పర్యటనలు వగైరా తెలిసిందే. త్వరలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నట్లు ప్రచారం సాగింది.

నయన్ ఈ ప్రేమాయణం గురించి కాస్త గుట్టుగా వ్యవహరించిన ప్రియుడు మాత్రం ఏదో సందర్భంలో తమ మధ్య ఉన్న బంధం గురించి బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసారు. ఇక ఏడాదిన్నర కాలంగో దేశంలో నెలకొన్న పరిస్థితులు గురించి తెలిసిందే.

వరుస లాక్ డౌన్ లతో అంతా ఇంటికే పరిమితవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ జంట కూడా ఇంటికే అంకితమైంది. సెకెండ్ వేవ్ లో పరిస్థితి సీరియస్ గా ఉండటంతో గడప దాటలేదెవరూ. ఈ తీరిక వేళల్లోనే విఘ్నేష్ నెటిజనులతో ముచ్చటిస్తూ ప్రియురాలి గురించి కొన్ని ఆసక్తికర సంగతులు చెప్పుకొచ్చారు. నయనతారతో మీరు దిగిన ఫోటోలు..వాటిలో మీకు బాగా నచ్చిన ఫోటో ఏది? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా! దానికి సమాధానంగా ఫోటోనే షేర్ చేశారు. ఆ దెబ్బకు సదరు నెటిజన్ మూగబోవాల్సి వచ్చింది.

అలాగే మరోక అభిమాని నయన్ లో బాగా నచ్చిన లక్షణం ఏంటి అని అడిగారు. నయనతారలో ఉన్న సెల్ఫ్ కాన్పిడెన్స్ ఎంతో నచ్చుతుందని…అది గొప్ప లక్షణమని పొగిడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. నయనతార తమిళ్ లో మూడు సినిమాలు చేస్తుండగా… అందులో ఒక చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో గోపీచంద్ సరసన ఆరడుగుల బుల్లెట్టులోనూ నయన్ నటిస్తోంది.