తమిళంలో రూపొందిన క్రేజీ మూవీ ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. వచ్చే నెలలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు .ఒకటి రెండు వారాల్లో సినిమా విడుదల తేదీపై స్పస్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో నయనతార మరియు సమంతలు కలిసి నటించడంతో పాటు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని ఇటీవల విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాను నయనతార ప్రియుడు విఘ్నేష్ శిన్ తెరకెక్కించాడు. ప్రియుడితో కలిసి నయన్ ఈ సినిమాను రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై సొంతంగా నిర్మించింది. సినిమా లో ముగ్గురి పాత్రలు చాలా విభిన్నంగా దర్శకుడు చూపించినట్లుగా చెబుతున్నారు.
తమిళ మీడియాలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర పుకారు ఒకటి వైరల్ అవుతోంది. అదేంటీ అంటే సినిమాలో నయనతార విలన్ గా కనిపించబోతుందట. అంటే విజయ్ సేతుపతి మరియు సమంతల మద్య వెళ్లి వారి ప్రేమకు విలన్ గా మారుతుందట. ఇదొక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అనే విషయం తెల్సిందే. తాజాగా తమిళ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తుంటే విజయ్ సేతుపతి మరియు సమంతలు ప్రేమికులు లేదా పెళ్లి చేసుకున్న జంటగా కనిపించబోతున్నారు. వారిద్దరి మద్య నయనతార విభేదాలు పెట్టేందుకు ప్రయత్నించే పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఊహాగానాలు వస్తున్నాయి.
సినిమా కథ ఏంటీ అనే విషయమై ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు. కాని అసలు విషయం ఏంటీ అనేది సినిమా వచ్చే నెలలో విడుదల అయితే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు. నయనతార విలన్ గా కనిపించడం అంటే ఖచ్చితంగా ప్రయోగమే. ఈ వార్తలు కనుక నిజం అయితే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం. నయనతార మరియు సమంతలను ఒకే సారి స్క్రీన్ పై చూడటం ఇదే ప్రథమం. కనుక ప్రేక్షకులు ఖచ్చితంగా సర్ ప్రైజ్ ఫీల్ అవ్వడంతో పాటు ఎంటర్ టైన్ అవుతారని అంటున్నారు. ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని కామెడీ యాంగిల్ లో తెరకెక్కించారట. కాస్త ఎమోషనల్ ఉన్నా ఎక్కువ శాతం సినిమాలో కామెడీ ఉంటుందని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.