జూన్ లో నయన్ విఘ్నేష్ ల రియల్ మ్యారేజ్

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి. వాటన్నింటిలోకి సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ కథ చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. ఆమె మొదట శింబు ను ప్రేమించింది.. ఆ తర్వాత ప్రభు దేవ తో ప్రేమాయణం సాగించింది. ఇక గత గతం కాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కలిసి ప్రేమలో ఉంది. వీరి ప్రేమ గురించి గత కొన్ని ఏళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న కారణంగా నయనతార పెళ్లి వాయిదా వేస్తూ వచ్చింది. పెళ్లి అయితే కాలేదు కాని నయన్ మరియు విఘ్నేష్ శివన్ లు సహజీవనం సాగిస్తున్నారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. చాలా కాలంగా వీరిద్దరి పెళ్లి అదుగో ఇదుగో అంటూ ప్రచారం జరిగింది. పెళ్లి జరిగింది అంటూ కూడా ప్రచారం జరిగింది. ఆ మద్య నయనతా నుదిటిన బొట్టు ఉండటం వల్ల పెళ్లి అయ్యిందనే వార్తలు వార్తలు వచ్చాయి.

పెళ్లి రహస్యంగా జరిగిందని.. పెళ్లికి సంబంధించిన విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు అంటూ ఆ సమయంలో పుకార్లు షికార్లు చేశాయి. కాని పెళ్లి అప్పటికి కాలేదు అని.. నుదిట బొట్టు విషయంలో మాత్రం నయనతార క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు నయనతార మరియు విఘ్నేష్ శివన్ ల పెళ్లి గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.

జూన్ నెలలో వీరి పెళ్లి జరుగబోతుందట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గత కొన్నాళ్లుగా పెళ్లి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక ఫుల్ స్టాప్ జూన్ నెలతో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ నెలలో చెన్నై లో భారీ ఎత్తున వివాహం జరుగబోతుంది. పెళ్లి తర్వాత రిసెప్షన్ కార్యక్రమం కూడా జరుగబోతుందట. అతి త్వరలోనే డేట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ప్రస్తుతం నయనతార తెలుగు లో రెండు సినిమాలతో పాటు తమిళం మరియు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. ప్రథానంగా హిందీలో ఈమె మొదటి సినిమా షారుఖ్ ఖాన్ తో అట్లీ దర్శకత్వంలో చేస్తోంది. కనుక ఆ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. లేడీ సూపర్ స్టార్ గా హోదా దక్కించుకున్న నయనతార పెళ్లి తర్వాత కూడా కంటిన్యూస్ గా సినిమాలు చేస్తుందేమో చూడాలి.