నెపోటిజం… ఇప్పుడిది సోషల్ మీడియాలో ట్రెండింగ్ వర్డ్. మీటూ మాదిరిగా దీనిని పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తూ పెద్దలను దూషిస్తున్నారు. అయితే వారసత్వం అనేది బాలీవుడ్ ఒక్కదానికే పరిమితం కాదు. ప్రతి చిత్ర సీమలోను ఇది కనిపిస్తుంది. ఆ మాటకు వస్తే తెలుగు చిత్రసీమలో ఉన్నంతగా ఇది మరెక్కడా ఉండదు.
ఇప్పుడున్న టాప్ హీరోలు అందరూ ఏదో ఒక కుటుంబానికి చెందిన వారే. పవన్, మహేష్, ప్రభాస్, తారక్, చరణ్, అల్లు అర్జున్… అందరూ స్టార్స్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. చిరంజీవి తర్వాత వచ్చి ఆ స్థాయికి వెళ్లకపోయినా మధ్య శ్రేణికి పరిమితం అయిన అవుట్ సైడర్స్ రవితేజ, నాని లాంటి కొందరే.
రాజకీయాలలో ఎలాగైతే కుటుంబ పాలనను ఎంకరేజ్ చేస్తారో, సినిమాలలో కూడా అభిమానులు అదే ధోరణి చూపిస్తుంటారు. అసలు సగటు జనం ప్రోత్సహించకపోతే నెపోటిజం ఉండదు. అలాగే కుటుంబ నేపథ్యం ఉన్న అందరూ స్టార్లు కాలేరు. ఇదంతా కొన్ని రోజుల పాటు టైం పాస్ వ్యవహారమే తప్ప ఇలాంటివి ఎన్ని జరిగినా ఎందులోనూ ఎలాంటి గణనీయమైన మార్పులేమీ ఉండవు.