నిహారిక విషయంలో మరోసారి ఎమోషనల్ అయిపోయిన నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం ఇటీవలే అట్టహాసంగా జరిగిన విషయం తెల్సిందే. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో నిహారిక వివాహం చైతన్యతో అంగరంగ వైభవంగా సాగింది. నిహారిక పెళ్లి సమయంలో నాగబాబు పోస్ట్ చేసి ఎమోషనల్ అయిన విషయం తెల్సిందే. తన కూతుర్ని స్కూల్ కు పంపే మొదటి రోజును గుర్తు చేసుకుంటూ ఇప్పటి పెళ్లిని ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యాడు.

ఇప్పుడు నిహారికకు పుట్టినరోజు విషయంలో కూడా నాగబాబు ఎమోషనల్ పోస్ట్ చేసాడు. నేను దేవుడిని నమ్మను. అలాంటి నా జీవితంలోకి నువ్వు వచ్చావు. ఏంజెల్స్ ఉంటారని నమ్మేలా చేసావు. నీ దృష్టిలో నేనెప్పుడూ గొప్పవాడిలా ఉండేందుకే తపన పడ్డాను. నిన్ను నవ్వించేందుకు ఎంతటి కింద స్థాయికైనా నేను వెళతాను అంటూ నాగబాబు ఎమోషనల్ పోస్ట్ చేసాడు.

ఇక నిహారికకు సోషల్ మీడియాలో మెసేజెస్ వెల్లువెత్తాయి. లావణ్య త్రిపాఠి, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖులు నిహారికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లయ్యాక తొలి పుట్టినరోజు కావడంతో చైతన్య కూడా పుట్టినరోజు శుభాకాంక్షలను తనదైన స్టైల్ లో తెలియజేసాడు. తన ఎదపై నిహారిక వాలిన ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే లవ్. నువ్వు నన్ను ఎల్లప్పుడూ ఎంత సంతోషంగా ఉంచుతున్నావో ఈ రోజు కూడా నువ్వు అంతే సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ నువ్వు వెలిగిపోతూనే ఉండు అని చైతన్య మెసేజ్ పోస్ట్ చేసాడు.