నిశ్శబ్దం..ఓ గుడ్ న్యూస్..

ఎన్నాళ్లుగానో వార్తల్లో నలుగుతున్న అనుష్క-మాధవన్ ల నిశ్శబ్ధం సినిమా ఓటిటి ఎంట్రీకి దాదాపు అన్ని వ్యవహారాలు పూర్తయిపోయాయి. ఇక అగ్రిమెంట్ సైన్ మాత్రం మిగిలింది. ఒకటి రెండు రోజుల్లో అదీ అయిపోతుంది. పీపుల్స్ మీడియా పతాకంపై నిర్మించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి వుంది. అందువల్ల ఆ సినిమా కోసం ఎదురుచూసేవారికి ఇది గుడ్ న్యూస్.

కానీ ఎప్పుడు విడుదలవుతుందన్నది క్లారిటీ లేదు. అమెజాన్ ప్రయిమ్ ఆచి తూచి విడుదలలు ప్లాన్ చేస్తోంది. శకుంతలాదేవి విడుదలచేసిన దాదాపు నాలుగయిదు వారాల తరువాత కానీ వి సినిమాను విడుదల చేయడం లేదు. ఆ తరువాత మరో నెల దాటిన తరువాతే సూర్య సినిమా ను ప్లాన్ చేసారు . ఆ లెక్కన నిశ్శబ్ధం సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అన్నది చూడాల్సి వుంది.

అగ్రిమెంట్ డేట్ కు విడుదల డేట్ కు అమెజాన్ ప్రయిమ్ లో చాలా గ్యాప్ వుంటోంది. ఈ లెక్కన నిశ్శబ్దం అగ్రిమెంట్ మరో రెండు రోజుల్లో అయితే కనుక, విడుదల మరో నెలకు కానీ వుండకపోవచ్చు. నిశ్శబ్దం కన్నా ముందే కీర్తి సురేష్ మిస్ ఇండియా ఓటిటిలో దర్శనం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.