‘గమనం’ నుండి శ్రియ తర్వాత నిత్యామీనన్

ఇటీవలే గమనం సినిమా నుండి శ్రియ లుక్‌ రివీల్‌ అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్‌ ముగింపు దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. శ్రియ చాలా సింపుల్‌ అండ్‌ స్వీట్‌ లుక్‌ తో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుండి నిత్యామీనన్‌ లుక్‌ ను రివీల్‌ చేశారు. నిత్యామీనన్‌ కూడా చాలా పద్దతైన లుక్‌ లో కనిపించింది. నిత్యా మీనన్‌ ఈ సినిమాలో సింగర్‌ గా కనిపించబోతున్నట్లుగా ఈ లుక్‌ చూస్తుంటే అర్థం అవుతోంది. గమనం సినిమాలో నిత్యా మీనన్‌ మరియు శ్రియలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుజన రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రమేష్‌ కరుతూరు, వెంకీ మరియు గనన శేఖర్‌ లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత మంది నటీనటులను అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు. సినిమాను ఎప్పుడు విడుదల చేసేది అతి త్వరలో క్లారిటీ ఇవ్వబోతున్నారట.