బిగ్ బాస్ 4: మరోసారి ఇంటి కెప్టెన్ గా ఎన్నికైన నోయెల్

బిగ్ బాస్ 4 ప్రస్తుతం ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరో వారంలో ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఇంటి నుండి ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు, ముగ్గురు వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చారు. కుమార్ సాయి, అవినాష్, స్వాతి దీక్షిత్ లు వైల్డ్ కార్డ్ లుగా ఎంట్రీ ఇవ్వగా సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్, సుజాత ఎలిమినేట్ అయ్యారు.

ప్రస్తుతం ఆరో వారంలో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. డీల్ ఆర్ నో డీల్ టాస్క్ ను కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అఖిల్ అండ్ అరియనా టీమ్ మధ్య పోటీ జరుగుతుండగా ఇంటి కెప్టెన్ సోహెల్ సంచలకునిగా వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంటి కెప్టెన్ గా నోయెల్ ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఈరోజు దీనికి సంబంధించిన టాస్క్ పూర్తయినట్లు సమాచారం.

నోయెల్ ఇప్పటికే ఒకసారి ఇంటి కెప్టెన్ గా నిలిచాడు. ఇప్పుడు మరోసారి కెప్టెన్ అయ్యాడు. దీంతో గత కొన్ని రోజులుగా డౌన్ లో ఉన్న నోయెల్ కు కొంత బూస్ట్ లభించినట్లు అవుతుంది. అలాగే వచ్చే వారం ఇమ్మ్యూనిటి కూడా దొరుకుతుంది. ఈ వారం నామినేషన్స్ లో నోయెల్ ఉన్నాడు. ఈ వీకెండ్ మరి ఉంటాడో ఎలిమినేట్ అవుతాడో చూడాలి.