ఎన్టీఆర్‌30 మూవీ లాంచింగ్‌ డేట్‌ వచ్చేసింది

గత ఏడాది సమ్మర్‌ లో ప్రారంభం అవ్వాల్సిన ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉంది. కాని కరోనా మొత్తం తలకిందులు చేసింది. ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్ఆర్‌ మూవీ ని పూర్తి చేయక పోవడం వల్ల ఇప్పటి వరకు త్రివిక్రమ్‌ తో మూవీని కనీసం ప్రారంభించలేక పోయాడు. ఎట్టకేలకు మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌ మొదటి వారం నుండి ఎన్టీఆర్‌ 30 సినిమాను పట్టాలెక్కించేందుకు త్రివిక్రమ్‌ కు లైన్‌ క్లీయర్‌ అయ్యింది. సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఖరారు అయ్యింది.

పండుగ రోజున అంటే జనవరి 14వ తారీకున మకర సంక్రాంతి సందర్బంగా ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ ల మూవీకి కొబ్బరి కాయ కొట్టబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. హాసిన అండ్‌ హారిక వారి ఆఫీస్ లో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయని అంటున్నారు. ఒకరు ఇద్దరు ప్రముఖులతో పాటు యూనిట్‌ సభ్యులు అంతా కూడా ఈ పూజా కార్యక్రమంలో హాజరు అయ్యే అవకాశం ఉంది. పవన్‌ కళ్యాణ్‌ ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి. సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి అనుకున్న యూనిట్‌ సభ్యులు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.