ఎన్టీఆర్ చిత్రానికి సంగీత దర్శకుడు అతనేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో కొమురం భీమ్ గా కనిపిస్తాడు ఎన్టీఆర్. మరికొన్ని రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత తన 30వ చిత్రంగా కొరటాల శివతో పనిచేయాలి ఎన్టీఆర్. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలోనే మొదలవుతాయి. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఓకే అయినట్లుగా తెలుస్తోంది. కొరటాల శివ సినిమాలకు ముందు నుండీ దేవి శ్రీ ప్రసాద్ వర్క్ చేసాడు.

ఆచార్య చిత్రానికి మాత్రం మణిశర్మను తీసుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు అనిరుధ్ తో వర్క్ చేయనున్నాడు కొరటాల శివ. అనిరుధ్ ఇప్పటికే అజ్ఞాతవాసి, జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకు తెలుగులో వర్క్ చేసాడు.