ఎన్టీఆర్ బర్త్ డే విడియోపై దానయ్య క్లారిటీ

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ 70 శాతంకు పైగా పూర్తి అయింది. గత నెలలో రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా భీం ఫర్ రామరాజు అనే వీడియోను విడుదల చేసి మెగా ఫ్యాన్స్ ను ఖుషి చేయడం జరిగింది. అయితే ఈ నెలలో ఎన్టీఆర్ బర్త్ డేకు మాత్రం ఎలాంటి ప్రత్యేక వీడియోలు ఉండక పోవచ్చు అంటూ ప్రచారం జరిగింది.

గత రెండు నెలలుగా షూటింగ్స్ తో పాటు అన్ని కూడా బంద్ ఉన్నాయి. కనుక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇలాంటి సమయంలో నిర్మాత దానయ్య స్పందించారు. ఎన్టీఆర్ ఫాన్స్ కోసం రాజమౌళి ఏం చేయాలో అది చేశారు. ఖచ్చితంగా అది వారికి సంతృప్తి ని కలిగిస్తుంది.

దానయ్య ఈ విషయంపై మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి ప్రత్యేకమైన వీడియోను విడుదల చేయబోతున్నారు. ఈ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు అన్నాడు. అయితే వీడియో ఎలా ఉండబోతోందో అనే విషయాన్ని మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. చరణ్ బర్త్ డేకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వీడియోను విడుదల చేశారు. అయితే ఇప్పుడు చరణ్ వాయిస్ ఓవర్ తో ఇది ఉంటుందా అనేది చూడాలి.